ఇండియాకు రప్పించేంత వరకు నిద్రపోనూ.. నా అన్వేషణకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నటి

ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు పేరుతో పిలువబడే అన్వేష్ అంశం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రపంచ దేశాలన్నీ చుట్టేస్తూ.. తెగ ఎంజాయ్‌ చేసేస్తూ.. ఆ వీడియోలను యూట్యూబ్ లో అప్‌లోడ్‌ చేస్తూ పాపులారిటీతో పాటు డబ్బులూ సంపాదిస్తున్నాడు అన్వేష్‌

ఇండియాకు రప్పించేంత వరకు నిద్రపోనూ.. నా అన్వేషణకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నటి
Karate Kalyani

Updated on: Feb 22, 2026 | 9:25 AM

ప్రముఖ యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు అన్వేష్ యవ్వారం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆన్ లైన్ బెట్టింగ్ బాగోతాలను బయట పెట్టి ఒక్కసారిగా హీరోగా మారాడు అన్వేష్. ఆ సమయంలో ఎంతో మందిపై సంచలన ఆరోపణలు చేశాడు అన్వేష్. మనోడు ఎవ్వరినీ వదల్లేదు. అయితే హీరో అయిన ప్రపంచ యాత్రికుడు అది జరిగిన కొన్ని నెలల్లోనే జీరో అయిపోయాడు. ఇండియాను, అందులోనూ హిందూ దేవుళ్లను దూషిస్తూ అతను చేసిన వీడియోలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. హిందూ దేవుళ్ళ పై తప్పుగా మాట్లాడి వార్తల్లో నిలిచాడు అన్వేష్. దాంతో అన్వేష్ పై విమర్శలు వెల్లువెత్తాయి. అంతవరకు ఎవరైతే అతనికి సపోర్టుగా నిలిచారో ఒక్కసారిగా దూరమయ్యరు. చాలా మంది ఫాలోవర్లు అతని సోషల్ మీడియా ఖాతాలను అన్ ఫాలో చేశారు.

 ఆమె ఇప్పుడు హీరోయినా..! అప్పట్లో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేసింది.. ఇప్పుడు ఎలా ఉందంటే

ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని పజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పలువురు ఫిర్యాదులు చేయగా కేసు నమోదు చేసి.. అతని కోసం పోలీసుల వేట కొనసాగిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే రీసెంట్ గా అన్వేష్ ఇన్ స్టాగ్రామ్ కనిపించకుండాపోయింది. దాంతో అన్వేష్ ఇన్ స్టా బ్యాన్ అయ్యిందని అంతా అనుకున్నారు. దీని మీద అన్వేష్ స్పందిస్తూ.. వీడియో కూడా వదిలాడు. ఇన్ స్టా పోతే పోయింది దానివల్ల నాకు రూపాయి ఉపయోగం లేదు అంటూ వీడియో రిలీజ్ చేశాడు. ఆతర్వాత కొత్త పాస్ పోర్ట్ కోసం ఇన్ స్టా డీయాక్టివేట్ అయ్యిందని అసలు విషయం చెప్పాడు.

ఉదయ్ కిరణ్ భార్య ఇప్పుడు ఎలా ఉందో.? ఏం చేస్తుందో తెలుసా.?

ఇదిలా ఉంటే అన్వేష్ ను ఇండియాకు రప్పించేంత వరకు నిద్రపోనూ అంటూ కరాటే కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్వేష్ పై ఇప్పటికే  కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అతని ఇన్ స్టా బ్లాక్ అవ్వడం పై కళ్యాణి స్పందిస్తూ.. అన్వేష్‌ను ఇండియాకు రప్పించేవరకు తాను నిద్ర పోయేదని లేదన్నారు. మరో రెండు రోజుల్లో నీపై లుక్ అవుట్ నోటీసులు ఇప్పిస్తానని కరాటే కల్యాణి హెచ్చరించారు. ఆమె కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

ప్రేమించి పెళ్లాడింది.. కట్ చేస్తే మూడేళ్లకే విడాకులు.. ఇప్పుడు మరొకరితో

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us