Jayamalini : శ్రీదేవి చనిపోయే ముందు నన్ను కలిసింది.. నాతో చెప్పిన చివరి మాటలు విని చాలా బాధేసింది.. జయమాలిని..

సీనియర్ నటి జయమాలిని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు స్పెషల్ పాటలతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. ఆమె సినీరంగంలోని దివగంత హీరోయిన్ శ్రీదేవి జ్ఞాపకాలను, తన కెరీర్‌లోని ముఖ్య విషయాలను గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఎం.జి.ఆర్, కృష్ణ, శోభన్ బాబు వంటి దిగ్గజాలతో తన అనుభవాలను, ఆనాటి సినీ వాతావరణాన్ని వివరించారు. శ్రీదేవి మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ, సినీ పరిశ్రమలోని వ్యక్తిగత సంబంధాలు, ఎదుర్కొన్న సవాళ్లను వెల్లడించారు.

Jayamalini : శ్రీదేవి చనిపోయే ముందు నన్ను కలిసింది.. నాతో చెప్పిన చివరి మాటలు విని చాలా బాధేసింది.. జయమాలిని..
Jayamalini, Sridevi

Updated on: May 29, 2026 | 4:07 PM

సీనియర్ నటి జయమాలిని ఇటీవల ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తన నట జీవితం, పరిశ్రమలోని దిగ్గజాలతో తన అనుభవాలు, వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె దివంగత నటి శ్రీదేవి గురించి భావోద్వేగానికి లోనయ్యారు. శ్రీదేవి మరణానికి ఆరు నెలల ముందు ఒక గెట్‌టుగెదర్‌కు ఆమెను పిలవాలని శారదా సూచించారని, అయితే ఆ అవకాశం లభించకుండానే శ్రీదేవి చనిపోయారని జయమాలిని గుర్తు చేసుకున్నారు. ఇది ఆమెను ఎంతగానో బాధించిందని తెలిపారు. అదేవిధంగా విజయనిర్మల మరణానంతరం కృష్ణ పడిన బాధను చూడలేకపోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన సినీ కెరీర్‌లో క్రమశిక్షణ, అంకితభావం తన విజయ రహస్యాలని జయమాలిని వివరించారు. కృష్ణ, శోభన్ బాబు వంటి అగ్ర నటులతో పనిచేసిన అనుభవాలను ఆమె గుర్తు చేసుకున్నారు.

ఎక్కువమంది చదివినవి : Suman Shetty : ఆ డైరెక్టర్ చెప్పడంతో హైదరాబాద్‏లో స్థలం కొని ఇల్లు కట్టాను.. ఇప్పుడు ధర ఎంతంటే.. సుమన్ శెట్టి..

వ్యక్తిగత జీవితంలో శారదా తనకు ఎన్నో సలహాలు ఇచ్చారని, ప్రేమలో పడి జీవితాన్ని నాశనం చేసుకోకుండా నిలదొక్కుకోవడానికి తాను చేసిన ప్రయత్నాలను ప్రశంసించారని జయమాలిని పేర్కొన్నారు. అలాగే ఒక సమావేశంలో సీనియర్ నటి శారద తనతో అన్న మాటలను జయమాలిని గుర్తుచేసుకున్నారు. “శారద నాతో మాట్లాడుతూ.. జయ, మనమందరం ఎలాగో కలుస్తున్నాం కదా, మన శ్రీదేవిని కూడా ఈసారి గెట్-టుగెదర్‌కి పిలుద్దాం. ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలోనే ఉంటూ నిరంతరం కష్టపడుతూనే ఉంది. మనతో వస్తే కాస్త ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పారు. దానికి నేను కూడా తప్పకుండా పిలుద్దాం అమ్మ అని అన్నాను” అంటూ జయమాలిని వివరించారు.

ఎక్కువమంది చదివినవి : Ammoru Movie: అమ్మోరు సినిమా ఛాన్స్ మిస్ చేసుకున్నా.. కారణం ఇదే.. టాలీవుడ్ హీరోయిన్..

అయితే విధి ఎంత విచిత్రమైనదంటే, వారు శ్రీదేవిని పిలవాలని అనుకున్న ఆరు నెలల లోపే ఆమె అకస్మాత్తుగా కన్నుమూశారు. ఈ విషయాన్ని చెబుతూ జయమాలిని ఎంతో ఆవేదన చెందారు. “బహుశా శ్రీదేవికి ముందే తెలిసిపోయిందేమో, అందుకే మమ్మల్ని కలవాలని అనుకుందేమో” అంటూ ఆ జ్ఞాపకాన్ని తలుచుకుని భావోద్వేగానికి లోనయ్యారు. శ్రీదేవి చిన్నతనం నుంచే పరిశ్రమలో ఎంతో కష్టపడ్డారని, ఆమెను కలిసి కాసేపు ఆనందంగా గడపాలని అనుకున్న తమ కోరిక తీరకుండానే ఆమె దూరమవ్వడం పట్ల జయమాలిని తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.

ఎక్కువమంది చదివినవి : Sudheer Babu: నా వయసు 49 సంవత్సరాలు.. 365 రోజులు ఇదే తింటాను.. డైట్ సీక్రెట్ చెప్పిన సుధీర్ బాబు.

 

ఎక్కువమంది చదివినవి : Trivikram : నాకు బాగా ఆవేశం తెప్పించిన పుస్తకం అది.. త్రివిక్రమ్ చెప్పిన ఈ బుక్స్ చదివితే జీవితం ఏంటో తెలుస్తుంది..

Follow Us