Janhvi Kapoor: జాన్వీ కపూర్‏కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు.. పరిస్థితి ఇప్పుడేలా ఉందంటే..

|

Jul 18, 2024 | 6:13 PM

గత మూడునాలుగు రోజులుగా ఈ మూవీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న జాన్వీ.. అస్వస్థతకు గురైనట్లుగా సమాచారం. దీంతో ఆమెను గురువారం ఆసుపత్రిలో చేర్చి కుటుంబసభ్యులు.. ఆమె తీసుకున్న ఆహారం కల్తీ కావడమే జాన్వీ అస్వస్థతకు కారణమని.. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె తండ్రి ప్రొడ్యూసర్ బోనీ కపూర్ వెల్లడించారు.

Janhvi Kapoor: జాన్వీ కపూర్‏కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు.. పరిస్థితి ఇప్పుడేలా ఉందంటే..
Janhvi Kapoor
Follow us on

ప్రస్తుతం పాన్ ఇండియా సినీ పరిశ్రమలో చేతినిండా సినిమాలతో అత్యంత బిజీగా ఉన్న హీరోయిన్ జాన్వీ కపూర్. తెలుగు, హిందీ భాషలలో అనేక సినిమాల్లో నటిస్తుంది. ఇటీవలే మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమాతో ప్రేక్షకులను అలరించిన జాన్వీ.. ఇప్పుడు దేవర, ఆర్సీ 16 సినిమాలతోపాటు.. హిందీలోనూ పలు సినిమాలు చేస్తుంది. కొన్ని రోజుల క్రితం అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలలో సందడి చేసిన జాన్వీ.. ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఆమె ఉలఝ్ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది. గత మూడునాలుగు రోజులుగా ఈ మూవీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న జాన్వీ.. అస్వస్థతకు గురైనట్లుగా సమాచారం. దీంతో ఆమెను గురువారం ఆసుపత్రిలో చేర్చి కుటుంబసభ్యులు.. ఆమె తీసుకున్న ఆహారం కల్తీ కావడమే జాన్వీ అస్వస్థతకు కారణమని.. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె తండ్రి ప్రొడ్యూసర్ బోనీ కపూర్ వెల్లడించారు.

ప్రస్తుతం జాన్వీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుండడగా.. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. రెండు రోజుల్లో ఆమెను డిశ్చా్ర్జ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జాన్వీ కోలుకునేవరకు.. ఆమె పనులన్నింటినీ వాయిదా వేయనున్నట్లు సమాచారం. అలాగే ఆమె మరికొన్ని రోజులు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ తర్వాత జాన్వీ ఆరోగ్య పరిస్థితిని చూసి సినిమాల షూటింగ్స్, ఈవెంట్స్ పై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. జాన్వీ కపూర్ నటించిన ‘ఉలఝ్’ చిత్రం త్వరలో థియేటర్లలోకి రానుంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. అలాగే ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్న జాన్వీకి ప్రతిసారి పెళ్లి గురించి ప్రశ్నలు రావడంతో చిరాకు పడిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న దేవర సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానుంది జాన్వీ. ఈ మూవీ కొన్ని నెలలుగా షూటింగ్ జరుగుతుంది. అలాగే రామ్ చరణ్, బుబ్చిబాబు కాంబోలో రానున్న తదుపరి ప్రాజెక్టులో నటించనుంది. ఇవే కాకుండా న్యాచురల్ స్టార్ నాని కొత్త సినిమాలో నటించనుంది. ఇవే కాకుండా మరిన్ని సినిమాల్లోనూ జాన్వీ కనిపించనున్నట్లు సమాచారం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.