Hansika Motwani: హన్సిక పెళ్లికి ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే! మరీ అంతనా!!

బ్యాచిలర్‌ పార్టీ మొదలు హల్దీ, సంగీత్, మెహందీ తదితర ప్రీ వెడ్డింగ్‌ కార్యక్రమాలను ఎంతో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈనేపథ్యంలో హన్సిక పెళ్లి ఖర్చు ఎంతయ్యిందా? అనే విషయంపై సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తోంది.

Hansika Motwani: హన్సిక పెళ్లికి ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే! మరీ అంతనా!!
Hansika Motwani

Updated on: Dec 11, 2022 | 3:37 PM

కోలీవుడ్‌ హీరోయిన్‌ హన్సిక మోత్వాని ఇటీవల వైవాహిక బంధంలోకి అడుగపెట్టిన సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన వ్యాపారవేత్త సోహైల్‌ కతూరియాతో కలిసి డిసెంబర్‌ 4న ఆమె పెళ్లిపీటలెక్కింది. జైపూర్‌లోని చరిత్రాత్మక ముండోతా కోట వేదికగా వీరి పెళ్లి అంగరంగవైభవంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు, పలువురు సినీ ,రాజకీయ ప్రముఖులు హన్సిక వివాహా వేడుకకు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. కాగా వివాహ వేడుకకు మూడు రోజుల ముందు నుంచే ఘనంగా ఏర్పాట్లు జరిగాయి. బ్యాచిలర్‌ పార్టీ మొదలు హల్దీ, సంగీత్, మెహందీ తదితర ప్రీ వెడ్డింగ్‌ కార్యక్రమాలను ఎంతో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈనేపథ్యంలో హన్సిక పెళ్లి ఖర్చు ఎంతయ్యిందా? అనే విషయంపై సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తోంది. కాగా ప్యాలెస్‌ అద్దె ఖర్చులు, పెళ్లి దుస్తులు, విందు భోజనాలు.. ఇలా అన్నీ కలిపి హన్సిక పెళ్లి ఖర్చు రూ.20 కోట్లు దాటిపోయిందని తెలుస్తోంది. ఇందులో పెళ్లి దుస్తులకు కూడా ఎక్కువే ఖర్చు చేశారట. హన్సిక ధరించిన గోల్డెన్‌ లెహంగా ఒక్కటే దాదాపు రూ.3 లక్షల వరకు ఉంటుందని నెట్టింట వార్తలు వస్తున్నాయి. అయితే ఇది నిజమా? అబద్ధమా? తెలియదు కానీ హన్సిక పెళ్లి మాత్రం గ్రాండ్‌గా జరిగిందనేది మాత్రం వాస్తవం.

సింధీ సంప్రదాయం ప్రకారం హన్సిక, సోహైల్‌ల వివాహ వేడుక జరిగింది. కాగా సొహైల్‌కు ఇది రెండో వివాహం. అతని మొదటి భార్య పేరు రింకే బజాజ్‌. కొన్నేళ్ల క్రితమే వీరు విడిపోయారు. కాగా సొహైల్‌ నిర్వహిస్తున్న వ్యాపార కార్యకలాపాల్లోనూ హన్సిక పార్ట్‌నర్‌గా ఉంటోంది. ఇప్పుడు వైవాహిక జీవితంలోనూ ఇద్దరూ భాగస్వామ్యులుగా మారారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల మహాసినిమాతో అర్ధసెంచరీ పూర్తిచేసుకుంది హన్సిక. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. పార్ట్‌నర్‌, 105 మినిట్స్‌, రౌడీ బాయ్‌, గార్డియన్‌ వంటి సినిమాలతో తెలుగులో మై నేజ్‌ ఈజ్‌ శ్రుతి అనే చిత్రంలో నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us