చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా దక్షిణాది ప్రేక్షకులకు ఇష్టమైన నటిగా మారింది అవికా గోర్. బాలనటిగా బుల్లితెరపై సందడి చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు హీరోయిన్గా వెండితెరపై అలరిస్తుంది. పన్నెండేళ్ల వయసులోనే నటన రంగంలోకి అడుగుపెట్టిన అవిక.. అతి చిన్న వయసులోనే ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకుంది. తెలుగులో ఉయ్యాల జంపాల సినిమా ద్వారా హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత సినిమా చూపిస్తా మావ మూవీతో హిట్ అందుకుంది. తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించిన అవికా.. తాజాగా హాట్ఫ్లైకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ఎదురైన కొన్ని చేదు సంఘటనల గురించి చెప్పింది. తనను కాపాడతాడని ఉద్యోగం ఇచ్చిన ఓ వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది.
పెద్దయ్యాక ఎన్నో హింసలు, సవాళ్లు ఎదుర్కొన్నానని అవికా చెప్పుకొచ్చింది. తనను రక్షించాల్సిన బాడీగార్డు తనతో అనుచితంగా ప్రవర్తించాడని వెల్లడించింది. ఓ ఈవెంట్లో బాడీగార్డు తనను దారుణంగా తాకాడని నటి తెలిపింది. అతను రెండుసార్లు అలాగే ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది. అతడు తనతో అసభ్యంగా ప్రవర్తించగానే ..అతడి వైపు చూసి ఏంటీ అని అడగ్గా.. వెంటనే తనకు సారీ చెప్పాడని.. దీంతో ఆ సంఘటనను వదిలేశానని.. వారు అలా ప్రవర్తించినప్పుడు.. అది ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అని వారికి తెలియదని.. అలా ప్రవర్తించినప్పుడు అతడిని కొట్టే ధైర్యం ఉంటే.. ఈపాటికి చాలా మందిని కొట్టేదానినని తెలిపింది.
ఇది చదవండి : Mathu Vadalara 2 Riya: హే.. రియా నువ్వు ఆ షార్ట్ ఫిల్మ్ చేశావా.. ? ఆ ఒక్క వీడియోతో ఫేమస్ చేసిందిగా..
కానీ ఇప్పుడు తనకు ఆ ధైర్యం ఉందని.. తనతో అసభ్యంగా ప్రవర్తించిన వారిని కొట్టగలనని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. తనలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని కోరుకుంటున్నట్లు తెలిపింది. ప్రస్తుతం అవికాకు అంతగా అవకాశాలు రావడం లేదు. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
ఇది చదవండి : Mathu Vadalara 2 Riya: హే.. రియా నువ్వు ఆ షార్ట్ ఫిల్మ్ చేశావా.. ? ఆ ఒక్క వీడియోతో ఫేమస్ చేసిందిగా..
Prema Kavali : వారెవ్వా.. ఏం మారింది భయ్యా.. నెట్టింట గత్తరలేపుతోన్న ప్రేమ కావాలి హీరోయిన్..
Aadi Movie: ఆది సినిమాలో ఈ నటి గుర్తుందా.. ? ఇప్పటికే అదే అందంతో మెస్మరైజ్ చేస్తోందిగా..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.