తప్పు తెలుసుకున్నా.. ఆ సినిమాలు అనవసరంగా చేశా..! టాలీవుడ్ హీరోయిన్ ఆవేదన

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లలో చాలా మంది గతంలో ఛైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన వారే. చిన్నతనంలోనే కెమెరాను ఫేస్ చేసిన వారే. అయితే చదువు, ఇతర కారణాలతో మధ్యలో ఇండస్ట్రీని వదిలేశారు. మళ్లీ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నారు. తమ అందం, అభినయంతో అదరగొడుతున్నారు.

తప్పు తెలుసుకున్నా.. ఆ సినిమాలు అనవసరంగా చేశా..! టాలీవుడ్ హీరోయిన్ ఆవేదన
Tollywood Actress

Updated on: Nov 12, 2025 | 1:24 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్.. తెలుగులో వరుస సినిమాలతో అలరించింది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. పవర్ స్టార్ పవర్ కళ్యాణ్, అల్లు అర్జున్, నాని సరసన నటించి మెప్పించింది. కానీ ఇప్పటివరకు ఒక్క హిట్టు కూడా అందుకోలేకపోయింది. చాలా కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు డిప్పుడే తిరిగి సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ మరోసారి నటనతో మెప్పిస్తుంది. అండలో అప్సరస అయినా కూడా ఈ అమ్మడికి అవకాశాలు తక్కువే.. తాజాగా ఆమె మాట్లాడుతూ అనవసరంగా కొన్ని సినిమాలు చేశాను అని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ  ఎవరంటే..

ఆ హాట్ బ్యూటీ ఎవరో కాదండోయ్.. న్యాచురల్ స్టార్ నాని నటించిన మజ్ను సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది అను ఇమ్మాన్యుయేల్. మొదటి సినిమాతోనే కుర్రకారును కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్స్ వచ్చాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి సినిమాతోపాటు.. అల్లు అర్జున్ సరసన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీలో నటించింది. ఈ చిత్రాలు ప్లాప్ కావడంతో ఈ అమ్మడుకు అంతగా క్రేజ్ రాలేదు. తెలుగులో కిట్టు ఉన్నాడు జాగ్ర్తత, ఆక్సిజన్, శైలజారెడ్డి అల్లుడు, అల్లుడు అదుర్స్, ఊర్వశివో రాక్షసివో సినిమాల్లో నటించినప్పటికీ కెరీర్ మొత్తంలో వరుస ప్లాప్స్ ఎదురయ్యాయి.

తెలుగులోతోపాటు తమిళలోనూ నటించినప్పటికీ సరైన హిట్టు రాలేదు. వరుస సినిమాలు ప్లాప్ కావడంతో ఈ ముద్దుగుమ్మకు ఆఫర్స్ తగ్గిపోయాయి. రీసెంట్ గా రష్మిక మందన్న నటించిన గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలో మెరిసింది.  ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది . తాజాగా అను మాట్లాడుతూ.. ఇకపై రొటీన్ కమర్షియల్ సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నానని స్పష్టం చేసింది. అలాగే కమర్షియల్ సినిమాల వాల్ల నన్ను నేను తీర్చిదిద్దుకోలేను.. పవన్‌ కళ్యాణ్‌, అల్లు అర్జున్‌, నాని, నాగచైతన్య, కార్తి, శివ కార్తికేయన్‌లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేశా.. కానీ కొన్ని సినిమాలు చేయకపోయి ఉండాల్సింది అనిపిస్తోంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అలాగే తనకు విభిన్నమైన పాత్రలు, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయడం ఇష్టమని చెప్పుకొచ్చింది అను. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.