Anita : నేను మాత్రం ఆ విషయంలో తొందరపడలేదు.. కానీ ఇది చాలా కష్టం.. అనిత కామెంట్స్

తొట్టి గ్యాంగ్, నేను పెళ్లికి రెడీ, ముసలోడికి దసరా పండుగ ఇలా వరుసగా సినిమాలు చేసింది. ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ కుచ్ తో హై అనే సినిమాలో నటించింది. అంతే కాదు తమిళ్ మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసింది ఈ అమ్మడు. అయితే చాలా కాలం సినిమాలకు దూరం అయ్యింది ఈ చిన్నది. పెళ్లి చేసుకో బిడ్డకు జన్మనించిన తర్వాత ఇప్పుడు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది.

Anita : నేను మాత్రం ఆ విషయంలో తొందరపడలేదు.. కానీ ఇది చాలా కష్టం.. అనిత కామెంట్స్
Actress Anitha

Updated on: Apr 12, 2024 | 3:33 PM

ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన నువ్వు నేను సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది అనిత. ఈ సినిమా తర్వాత తరుణ్ హీరోగా నటించిన నిన్నే ఇష్టపడ్డాను సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతర్వాత వరుసగా సినిమాలు చేసింది. తొట్టి గ్యాంగ్, నేను పెళ్లికి రెడీ, ముసలోడికి దసరా పండుగ ఇలా వరుసగా సినిమాలు చేసింది. ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ కుచ్ తో హై అనే సినిమాలో నటించింది. అంతే కాదు తమిళ్ మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసింది ఈ అమ్మడు. అయితే చాలా కాలం సినిమాలకు దూరం అయ్యింది ఈ చిన్నది. పెళ్లి చేసుకో బిడ్డకు జన్మనించిన తర్వాత ఇప్పుడు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది.

సినిమాలకు గ్యాప్ ఇచ్చిన అనిత.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా తన ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. అంతే కాదు అందాలతోనూ కవ్విస్తుంది ఈ చిన్నది. అప్పటికంటే ఇప్పుడు మరింత గ్లామరస్ గా కనిపిస్తుంది అనిత. ఇక ఈ అమ్మడు త్వరలోనే ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది. తాజాగా అనిత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది.

అయితే పెళ్ళైన తర్వాత అనిత బరువు పెరిగింది. కొడుకు పుట్టిన తర్వాత అనిత బరువు బాగా పెరిగింది. 76 కిలోలు ఉన్న అనితా ప్రస్తుతం 58 కిలోలకు తగ్గింది. ఇందుకు సంబందించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. బరువు తగ్గడానికి తనకు దాదాపు రెండేళ్లు పట్టిందని తెలిపింది. బరువు తగ్గడం నిజంగా చాలా కష్టం.. కానీ నేను మాత్రం తొందరపడలేదు.. వెయిట్ లాస్‌ కోసం. కావాల్సినంత సమయం తీసుకున్నా.. నేను నా గోల్ కుమరికొన్ని అడుగుల దూరంలో మాత్రమే ఉన్నా.. గతంలో నేను నా ప్రెగ్నెన్సీని ఆస్వాదించా.. ఏం జరిగినా మనం మానసికంగా సిద్ధంగా ఉండాలి. ఒకసారి బిడ్డ పుట్టిన తర్వాత శరీరం, హార్మోన్ల మార్పులు, మానసిక స్థితిలో చాలా మార్పులు వస్తాయని చెప్పుకొచ్చింది అనిత.

అనిత ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.