Ananya Nagalla: బడా ప్రొడ్యూసర్‌ కుమారుడితో పెళ్లి పుకార్లు.. స్పందించిన అనన్య.. వారికి చాలా థ్యాంక్స్‌ అంటూ..

నటిగా ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తోన్న అనన్యపై ఇటీవల కొన్ని రూమర్లు వచ్చాయి. ఆమె త్వరలోనే పెళ్లిపీటలెక్కనుందన్న వార్తలు గుప్పుమన్నాయి. టాలీవుడ్‌కు చెందిన ఓ అగ్ర నిర్మాత రెండో కుమారుడితో ఆమె ఏడడుగులు నడవనుందని ..

Ananya Nagalla: బడా ప్రొడ్యూసర్‌ కుమారుడితో పెళ్లి పుకార్లు.. స్పందించిన అనన్య..  వారికి చాలా థ్యాంక్స్‌ అంటూ..
Ananya Nagalla

Updated on: Oct 02, 2022 | 2:00 PM

‘మల్లేశం లాంటి వైవిధ్యమైన సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. ఆతర్వాత ప్లే బ్యాక్‌, వకీల్‌సాబ్‌, మ్యాస్ట్రో సినిమాల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సమంత ప్రధాన పాత్రలో నటిస్తోన్న శాకుంతంలోనూ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. సోషల్‌ మీడియాలో ఫుల్‌ బిజీగా ఉండే ఈ అందాల తార.. నిత్యం తన గ్లామరస్‌ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటోలను షేర్‌ చేస్తోంది. ఇప్పుడిప్పుడే నటిగా అడుగులు వేస్తోన్న అనన్యపై ఇటీవల కొన్ని రూమర్లు వచ్చాయి. ఆమె త్వరలోనే పెళ్లిపీటలెక్కనుందన్న వార్తలు గుప్పుమన్నాయి. టాలీవుడ్‌కు చెందిన ఓ అగ్ర నిర్మాత రెండో కుమారుడితో ఆమె ఏడడుగులు నడవనున్నారని సోషల్‌ మీడియాతో పాటు పలు వెబ్‌సైట్స్‌లో కథనాలు వినిపించాయి.

తాజాగా వీటిపై స్పందించిన అనన్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘నాకోసం వరుడిని వెతికినందుకు థ్యాంక్స్‌. మరి పెళ్లి ఎప్పుడు, ఎక్కడ చేస్తున్నారో నాక్కూడా దయచేసి తెలియజేయండి. అప్పుడే కదా.. నా పెళ్లికి నేను కూడా హాజరు కాగలను’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో తనదైన సెటైర్లు వేసింది. దీనికి ఒక స్మైలీ ఎమోజీని కూడా జత చేసింది. కాగా ఈ వ్యాఖ్యలతో తన పెళ్లిపై వస్తోన్న వార్తలు అబద్ధమేనని తేల్చిచెప్పేసింది అనన్య.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us