
బాలీవుడ్ హీరోయిన్ రాధిక ఆప్టే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హిందీ, తెలుగులో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ నటిగా ప్రశంసలు అందుకుంది. ఇప్పటికీ వైవిధ్యమై పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. తెలుగులో తక్కువ సినిమాలు చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు హిందీలో సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంటుంది. ఇటీవల సాలి మొహమ్మద్ సినిమాలో నటించింది. ఇందులో తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఒక సమయంలో తన బరువు కారణంగా సినిమాల నుంచి తనను తొలగించారని గుర్తుచేసుకుంది.
ఇవి కూడా చదవండి : Ranu Bombaiki Ranu Song : యూట్యూబ్ సెన్సేషన్.. రానూ బొంబాయికి రాను పాటకు ఎంత అమౌంట్ ఇచ్చారంటే.. డ్యాన్సర్ లిఖిత కామెంట్స్..
బరువు పెరగడం వల్ల తన జీవితాన్ని మార్చే పాత్రను మిస్ అయ్యానంటూ గుర్తు చేసుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాధిక మాట్లాడుతూ.. కొన్ని సంవత్సరాల క్రితం తనను దృష్టిలో పెట్టుకుని ఒక కథ రాశారని.. ఆ సినిమా గురించి తనను సంప్రదించారని తెలిపింది. ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ కావడానికి కావాల్సిన అన్ని పనులు జరిగిపోయాయని.. అంతకు ముందే తాను ఒక ట్రిప్ ప్లాన్ చేసుకున్నానని.. అక్కడకి వెళ్లొచ్చకా సినిమా రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసుకున్నారట. ట్రిప్ సమయంలో ఎలాంటి డైట్ పాటించలేదని దీంతో తాను అనుహ్యంగా బరువు పెరిగినట్లు తెలిపింది. ట్రిప్ వెళ్లొచ్చాక దాదాపు నాలుగు కిలోల బరువు పెరిగానని.. వెయిట్ లాస్ అవుతానని చెప్పినప్పటికీ మేకర్స్ వినలేదని తెలిపింది. దంతో తనను ఆ సినిమా నుంచి తప్పించి మరొకరిని ఎంపిక చేశారని తెలిపింది.
ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..
ఆ తర్వాత మరో సినిమా కూడా తనకు తెలియకుండానే మిస్ అయ్యిందని.. నిజం తెలుసుకోవడానికి తనకు నాలుగు సంవత్సరాలు పట్టిందని తెలిపింది. కొన్నాళ్లకు తన బరువు, లుక్స్ గురించి పెద్దగా పట్టించుకోవడం మానేశానని.. కేవలం పాత్ర, కంటెంట్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నానని తెలిపింది. ప్రస్తుతం రాధిక సినిమాలు తగ్గించి తన బిడ్డతో గడపుతుంది.
ఇవి కూడా చదవండి : Actor Suresh: సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. ఒక్క మాటలో చెప్పేసిన సీనియర్ హీరో..