Sai Dhanshika: విశాల్‌ ప్రియురాలి కొత్త సినిమా.. ట్రైలర్ చూశారా?  దుమ్మురేపిన సాయి ధన్సిక

సాయి ధన్సిక.. ప్రస్తుతం దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఈ పేరు తెగ మార్మోగిపోతోంది. మరో స్టార్ హీరో విశాల్‌తో ప్రేమలో ఉండడమే ఇందుకు కారణం. ఇటీవలే తమ ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారీ లవ్ బర్డ్స్. అలాగే తమ పెళ్లి ముహూర్తం కూడా చెప్పేశారు.

Sai Dhanshika: విశాల్‌ ప్రియురాలి కొత్త సినిమా.. ట్రైలర్ చూశారా?  దుమ్మురేపిన సాయి ధన్సిక
Vishal, Sai Dhanshika

Updated on: May 24, 2025 | 5:40 PM

కోలీవుడ్ హీరోయిన్ సాయి ధన్సిక ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేడీ ఓరియంటెడ్ మూవీ ‘యోగి డా’. గౌతమ్ కృష్ణ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో షయాజీ షిండే, కబీర్ దుహాన్ సింగ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీ మోనికా సినీ ఫిల్మ్స్ బ్యానర్‌పై వి సెంథిల్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. హీరో విశాల్ కు చెందిన విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ ఈ సినిమా ట్రైలర్ షేర్‌ చేసింది. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తోంది సాయి ధన్సిక. అందుకు తగ్గట్టుగానే యాక్షన్ సీక్వెన్స్ లో దుమ్ము రేపిందీ అందాల తార. ఇప్పుడు ట్రైలర్ లోనూ అదే కనిపించింది. కాగా యోగి డా సినిమా కోసం డూప్‌ లేకుండానే రియల్‌గా ఆమె స్టంట్స్‌ చేశారట. కాగా కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది ధన్సిక. అందులో ఆమె రజనీ కూతురు యోగిగా అద్భుతంగా నటించింది. ఇప్పుడు యోగి డా అనే టైటిల్ తోనే మన ముందుకు వస్తోంది. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.

కాగా ఇటీవలే చెన్నైలో యోగిడా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో విశాల్ ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్లోనే విశాల్, సాయి ధన్సికలు తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అలాగే ఆగస్టు 29న తమ వివాహం ఆగస్టు 29న జరుగుతుందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

యోగిడా టీమ్ కు విశాల్ బెస్ట్ విషెస్..

మరోవైపు విశాల్ ఈ ఏడాది జనవరిలో ‘మదగజరాజ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎప్పటి నుంచో వాయిదా పడుతోన్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజై సూపర్ హిట్ గా నిలిచింది. విశాల్ తన తర్వాతి సినిమా గురించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

యోగి డా సినిమా ట్రైలర్..

 

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.