Salaam Namaste: విడుదలకు సిద్ధమైన ‘సలామ్ నమస్తే’.. థియేటర్‏లో రిలీజ్ ఎప్పుడంటే..

Salaam Namaste: కరోనా మహామ్మారి సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపించింది. థియేటర్లు మూతపడగా.. షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు

Salaam Namaste: విడుదలకు సిద్ధమైన సలామ్ నమస్తే.. థియేటర్‏లో రిలీజ్ ఎప్పుడంటే..

Updated on: Aug 11, 2021 | 9:46 PM

Salaam Namaste: కరోనా మహామ్మారి సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపించింది. థియేటర్లు మూతపడగా.. షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్దమైన ఎన్నో సినిమాలు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో కొన్ని చిత్రాలు ఓటీటీలలో విడుదలై సూపర్ హిట్ అందుకున్నాయి. అయితే చిన్న సినిమాలను మాత్రం ఓటీటీలో కాకుండా.. థియేటర్లలలో విడుదలయ్యేందుకు వెయిట్ చేస్తూ వచ్చారు నిర్మాతలు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో జూలై 30 నుంచి థియేటర్లు తిరిగి తెరుచుకుంటున్నాయి. దీంతో చిన్న సినిమా నిర్మాతలు తమ చిత్రాలను థియేటర్లలో విడుదల చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత విడుదలైన సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన తిమ్మరుసు మూవీ విజయాన్ని అందుకుంది. ఇటీవల విడుదలైన ఎస్ఆర్ కళ్యాణమండపం కలెక్షన్ల పరంగా దూసుకుపోతుండడంతో.. ఇతర సినిమా నిర్మాతలు తమ చిత్రాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. Thanish

ఈ క్రమంలోనే యంగ్ హీరో తనీష్ ప్రధాన ప్రాతలో నటించిన సలామ్ నమస్తే సినిమా కూడా విడుదలకు సిద్ధమైంది. డైరెక్టర్ వజ్జా లక్షణ్ తెరకెక్కించిన ఈ మూవీ ఈనెల (ఆగస్ట్ 13న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మిత్ర, ప్రియా హీరోయిన్లుగా నటించగా.. అభిమన్యు చౌదరీ కీలక పాత్రలో నటించారు. శిరీష క్రియేషన్స్ బ్యానర్ పై కెల్ల భాస్కర్ రావు ఈ సినిమాను నిర్మించగా.. సుకుమార్ సంగీతం అందించారు.

Also Read: Pushpa Movie: దాక్కో దాక్కో మేక సాంగ్ ప్రోమో రిలీజ్.. బన్నీ అస్సలు తగ్గడం లేదుగా.. ఫ్యాన్స్‏కు పూనకాలే..

Paagal Pre Release Event: లవ్ యూ చెప్పడం వేరు.. లవ్ చేయడం వేరు అంటున్న ‘పాగల్’.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్..\

Kavya Madhavan: తెరపైకి మరోసారి హీరోయిన్ భావన కిడ్నాప్ కేసు.. నటి కావ్య మాధవన్‏ను విచారిస్తున్న పోలీసులు..

Kasturi: మూడేళ్లు ప్రాణం కోసం పోరాటం.. ఆ సమయంలో ఎన్నో నేర్చుకున్నాను.. నటి కస్తూరి ఎమోషనల్ కామెంట్స్..