
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగు ప్రేక్షకులు అతనిని అమితంగా అభిమానిస్తారు. రెట్రో సినిమాలో చివరిగా కనిపించిన సూర్య చేతిలో ప్రస్తుతం మూడు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో టాలీవుడ్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న సూర్య 46 కూడా ఉంది. ఈ మూవీలో లేటెస్ట్ సెన్సేషన్ ప్రేమలు ఫేం మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదే సినిమాలో తమిళ నటుడు చరణ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ క్రమంలో తాజాగా సూర్య 46 సెట్ లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అదేంటంటే.. సూర్య తన కో స్టార్ చరణ్ కు ఒక సూపర్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. చరణ్ కుమారుడు చర్విక్‌కు గోల్డ్ చైన్‌ను బహుమతిగా ఇచ్చాడు. సూర్య 46 పూజా కార్యక్రమంలో చర్విక్ మెడలో బంగారు గొలుసు వేశాడు. అనంతరం చర్విక్‌ను కొద్దిసేపు ఎత్తుకుని ఆటాడించాడు. కాగా సూర్యకు చరణ్ వీరాభిమాని. ఈ క్రమంలో తన అభిమాన హీరో తమ పట్ల చూపించిన ప్రేమకు చరణ్ ఫిదా అయిపోయాడు. ఈ మేరకు హీరో సూర్యకు ధన్యవాదాలు తెలుపుతూ ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు హీరో సూర్య పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సూర్య గొప్ప తనానికి ఇది మరొక నిదర్శనమంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. కాగా సూర్య 46 సినిమాలో సీనియర్ నటి రవీనా టాండన్, రాధికాశరత్ కుమార్, తమిళ నటి భవాని స్రే కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశి, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.
What an incredible surprise from the legendary Actor *Suriya* himself, such a kind gesture — gifted my baby boy *Charvik* a gold chain for his 1st Birthday!
Thank you, *Suriya* sir—we’re forever grateful! 🙏✨@SuriyaFansClub #suriya46 @ActorSuriyaoff pic.twitter.com/grbI6DCngR
— Charan (@Charanmaveric) December 17, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.