Sonusood: అందరి వాడు ఇప్పుడు హైదరాబాదీ అవుతున్నాడు.. భాగ్య నగరంలో ఇళ్లు కొనుగోలు చేసిన సోనూ.?

Sonusood: కరోనా కష్ట కాలంలో వలస కూలీలకు ప్రయాణ ఏర్పాట్లతో మొదలైన సోనూసూద్‌ దాతృత్వం.. ఇంతింతై వటుడింతై అన్నట్లు ఆకాశాన్ని తాకింది. ఎక్కడ ఎవరు కష్టంలో ఉన్నారని తెలిసినా...

Sonusood: అందరి వాడు ఇప్పుడు హైదరాబాదీ అవుతున్నాడు.. భాగ్య నగరంలో ఇళ్లు కొనుగోలు చేసిన సోనూ.?
Sonusood
Follow us

|

Updated on: Jul 16, 2021 | 8:04 AM

Sonusood: కరోనా కష్ట కాలంలో వలస కూలీలకు ప్రయాణ ఏర్పాట్లతో మొదలైన సోనూసూద్‌ దాతృత్వం.. ఇంతింతై వటుడింతై అన్నట్లు ఆకాశాన్ని తాకింది. ఎక్కడ ఎవరు కష్టంలో ఉన్నారని తెలిసినా వెంటనే స్పందిస్తూ కలియుగ కర్ణుడిగా మారారు సోనూ. సోషల్‌ మీడియా వేదికగా సాయం అడిగిందే తడవుగా సహాయం చేస్తూ దేశ వ్యాప్తంగా గొప్ప పేరు సంపాదించుకున్నారు. సోనూసూద్‌ పేరుతో గుడి నిర్మించి ఏకంగా ప్రజలు ఆయనను దేవుడిని చేసేశారు. ఇంతలా సోసూసూద్‌ ప్రజలను ప్రభావితం చేశారు. రీల్‌ లైఫ్‌లో విలన్‌ పాత్రల్లో నటించిన సోనూసూద్‌ రియల్ లైఫ్‌లో మాత్రం హీరోగా మారాడు. దీంతో దర్శక, నిర్మాతలు సోనూద్‌ను విలన్‌గా చూపించాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. అందుకే ఆయన ఇప్పటికే నటించిన సినిమాల్లో సన్నివేశాలను సైతం మార్పులు చేశారని అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే ఇన్ని రోజులు ముంబయిలో ఉన్న సోసూసూద్‌ తాజాగా హైదరాబాద్‌కు షిఫ్ట్‌ కానున్నారని వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం సోనూ హైదరాబాద్‌లో ఓ ఇంటిని కొనుగోలు చేశారని తెలుస్తోంది. తెలుగులో ఎక్కువగా ఆఫర్లు వస్తోన్న కారణంతో హైదరాబాద్‌లోనే ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతోనే సోనూ బంజారాహిల్స్‌లో ఓ ఇంటిని కొనుగోలు చేశేరాని వార్తలు వస్తున్నాయి. ఇందు కోసం సోనూసూద్‌ రూ. 10 కోట్లు ఖర్చు పెట్టారని టాక్‌ నడుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే సోనూసూద్‌ అధికారికంగా స్పందించే వరకు వేచి చూడాల్సిందే.

Also Read: Hansika: నువ్వు నాకు ఎంత ముఖ్యమో మాటల్లో చెప్పలేను.. ఎమోషనల్‌ పోస్ట్ చేసిన దేశముదురు బ్యూటీ.

WhatsApp Accounts Banned: కస్టమర్లకు షాకింగ్‌.. భారత్‌లో 20 లక్షల వాట్సాప్‌ ఖాతాలపై నిషేధం.. కారణం ఏంటంటే..!

kajal: ఆ విషయాన్ని ప్రతీరోజూ గుర్తుంచుకోవాలని చెబుతోన్న చందమామ.. ఆసక్తిర పోస్ట్ చేసిన కాజల్‌.