Shivaraj Kumar : గుమ్మడి నర్సయ్య బయోపిక్‏లో శివరాజ్ కుమార్.. తెలుగు నేర్చుకుని మరీ స్వయంగా డబ్బింగ్..

ప్రఖ్యాత రాజకీయ నాయకుడు, ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నారు మాజీ ఎమ్మేల్యే గుమ్మడి నర్సయ్య. ఇప్పుడు ఆయన జీవితకథతో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కొత్త దర్శకుడు పరమేశ్వర్ హివ్రాలే తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై ఎన్. సురేశ్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో కన్నడ హీరో శివరాజ్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

Shivaraj Kumar : గుమ్మడి నర్సయ్య బయోపిక్‏లో శివరాజ్ కుమార్.. తెలుగు నేర్చుకుని మరీ స్వయంగా డబ్బింగ్..
Shivaraj Kumar

Updated on: Dec 06, 2025 | 2:07 PM

విప్లవ పార్టీ, ప్రముఖ రాజకీయ నాయకుడు, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవితంపై సినిమా రానున్న సంగతి తెలిసిందే. గుమ్మడి నర్సయ్య పేరుతో ఈ సినిమాను కొత్త డైరెక్టర్ పరమేశ్వర్ హివ్రాలే తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై ఎన్. సురేశ్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం పాల్వంచలో జరిగింది. ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. గుమ్మడి నర్సయ్య సినిమా కోసం తాను తెలుగు నేర్చుకుంటానని.. తనే స్వయంగా డబ్బింగ్ చెబుతానని అన్నారు.

ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : అబ్బ సాయిరాం.. ఒక్క మాటతో టాప్ 5కు.. ఓటింగ్‏లో దుమ్ములేపుతున్న డేంజర్ జోన్ కంటెస్టెంట్.. ఎలిమినేట్ అయ్యేది..

“ఈ సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. మంచి మనిషి జీవిత చరిత్రలో నేను నటిస్తున్నాను. మన కోసం కాదు.. ఇతరుల కోసం బతకాలని మా నాన్న ఎప్పుడూ చెప్పేవారు. నాకు అలా ఉండడమే ఇష్టం. శుక్రవారం గుమ్మడి నర్సయ్య ఇంటికి వెళ్లి వాళ్ల కుటుంబసభ్యులను కలిశాను. నా సొంత మనుషులను కలిసినట్లు అనిపించింది. నర్సయ్యను చూస్తుంటే మా నాన్నను చూసినట్లు అనిపించింది. నేను తెలుగులో మాట్లాడం లేదని ఏమీ అనుకోకండి. త్వరలోనే తెలుగు నేర్చుకుంటాను. ఈ సినిమాకు నేనే స్వయంగా డబ్బింగ్ చెబుతాను. రాజకీయాల్లోకి రావాలనుకునే యువత కచ్చితంగా దీనిని వీక్షించాలి” అని శివరాజ్ కుమార్ అన్నారు.

ఇవి కూడా చదవండి : Shhyamali De: నిద్రలేని రాత్రులు గడుపుతున్నా.. నా బాధను అర్థం చేసుకోండి.. రాజ్ నిడుమోరు మాజీ భార్య పోస్ట్..

గుమ్మడి నర్సయ్య సినిమాకు సంబంధించి ఇదివరకు విడుదలైన పోస్టర్స్ ఆసక్తిని కలిగించాయి. గుమ్మడి నర్సయ్య పాత్రలో శివరాజ్ కుమార్ లుక్ ఆకట్టుకుంది. భూజానికి సంచి, మరో భుజంపై ఎర్ర కండువా.. చేతిలో సైకిల్, ఆ సైకిల్ కు సుత్తి కొడవలి జండా, వెనకాల అసెంబ్లీ ఇలా చాలా ఎలిమెంట్స్ ని ఈ ఒక్క పోస్టర్ లో చూపించి ఆసక్తిని పెంచారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నారు.

ఇవి కూడా చదవండి : Actress : ఆ పని నేను చేయలేదు.. అందుకే నాకు ఆఫర్స్ రావడం లేదు.. హీరోయిన్ స్నేహా ఉల్లాల్..