Sharwanand : తండ్రైన శర్వానంద్.. ఆలస్యంగా కూతురి ఫోటో షేర్ చేసిన హీరో.. ఏం పేరు పెట్టారంటే..

శర్వా పుట్టినరోజు కావడంతో వరుసగా ఆయన కొత్త ప్రాజెక్ట్ అప్డేట్స్ షేర్ చేస్తున్నారు మేకర్స్. ఒక్కరోజే తన మూడు కొత్త సినిమాలను అనౌన్స్ చేశాడు ఈ హీరో. కానీ ఇప్పుడు అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చాడు శర్వానంద్. తాను తండ్రిగా ప్రమోషన్ పొందినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తన ముద్దుల కూతురు ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేశారు.

Sharwanand : తండ్రైన శర్వానంద్.. ఆలస్యంగా కూతురి ఫోటో షేర్ చేసిన హీరో.. ఏం పేరు పెట్టారంటే..
Sharwanand
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 06, 2024 | 8:10 PM

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ పుట్టినరోజు నేడు (మార్చి 6). ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికంగా సినీ ప్రముఖులు, అభిమానులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. మరోవైపు శర్వా పుట్టినరోజు కావడంతో వరుసగా ఆయన కొత్త ప్రాజెక్ట్ అప్డేట్స్ షేర్ చేస్తున్నారు మేకర్స్. ఒక్కరోజే తన మూడు కొత్త సినిమాలను అనౌన్స్ చేశాడు ఈ హీరో. కానీ ఇప్పుడు అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చాడు శర్వానంద్. తాను తండ్రిగా ప్రమోషన్ పొందినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తన ముద్దుల కూతురు ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేశారు. అంతేకాదు.. తమ కూతురికి లీలా దేవి మైనేని అనే పేరు కూడా పెట్టినట్లు వెల్లడించారు. ప్రస్తుతం శర్వా షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్.

View this post on Instagram

A post shared by Sharwanand (@imsharwanand)

శర్వానంద్ గతేడాది బ్యాచిలర్ లైఫ్‏కు ఫుల్ స్టాప్ పెట్టేసి వివాహాబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. జూన్ 3న రక్షితా రెడ్డిని వివాహం చేసుకున్నారు. వీరి వివాహ వేడుకకు ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు, స్నేహితులు హాజరయ్యారు. జైపూర్ లోని లీలా ప్యాలెస్ వేదికగా జరిగిన రెండు రోజుల పెళ్లి వేడుకల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆయన సతీమణి ఉపాసనతో కలిసి సందడి చేశారు.

View this post on Instagram

A post shared by Sharwanand (@imsharwanand)

View this post on Instagram

A post shared by Sharwanand (@imsharwanand)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.