ఆడవాళ్లు మీకు జోహార్లు తర్వాత శర్వానంద్ (Sharwanand) నటించిన లేటేస్ట్ చిత్రం ఒకే ఒక జీవితం. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా డైరెక్టర్ శ్రీకార్తిక్ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 9న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో రీతూ వర్మ కథానాయికగా నటించగా.. అక్కినేని అమల.. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలకపాత్రలలో నటించారు. విడుదలైన మొదటి రోజే అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది ఈ మూవీ. అయితే శుక్రవారం తన తల్లితోపాటు కుటుంబంతో కలిసి ఈ సినిమా చూశారు శర్వానంద్. మథర్ తో కలిసి థియేటర్లలో సినిమా చూసి వస్తున్న వీడియోను షేర్ చేస్తూ మనసు నిండిపోయింది అంటూ క్యాప్షన్ ఇచ్చారు శర్వానంద్. అందులో తన కుటుంబం శర్వాను అప్యాయంగా పలకరిస్తూ కనిపించారు.
డైరెక్టర్ శ్రీకార్తీక్ తెరకెక్కించిన ఈ సినిమా తల్లి.. కొడుకుల మధ్య బంధాన్ని చూపిస్తుంది. కళారంగంలో సంగీతాకళాకారుడిగా ఎదగాలనుకున్నఓ కుర్రాడికి.. ఎదురైన పరిస్థితులు.. తల్లి మరణంతో జీవితంపై ఆశలు కోల్పోతాడు. కానీ ఓ సైంటిస్ట్ సాయంతో మళ్లీ గతంలోకి తన స్నేహితులతో కలిసి వెళ్లిన తర్వాత తన తల్లిని కలుసుకోవడం.. ఎదురైన సందర్భాలు ఈ సినిమాలో చూడవచ్చు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించారు. ఇక ఈ సినిమా కాకుండా.. శర్వానంద డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇందులో రాశి ఖన్నా కథానాయికగా నటిస్తోంది.
Heart is full ❤️#OkeOkaJeevitham #Kanam pic.twitter.com/vZdIHKTM8g
— Sharwanand (@ImSharwanand) September 9, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.