ఆ హీరో మనసు బంగారం.. కళ్ళజోడు కావాలని అడిగితే షాపే కొనిస్తా అన్నాడు..

విలక్షణ నటనతో ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నారు నటుడు సముద్రఖని. దర్శకుడిగా, రచయితగా రాణించిన సముద్రఖని ఇప్పుడు విలన్ పాత్రలతో ఆకట్టుకుంటున్నారు. అలవైకుంఠపురంలో, క్రాక్, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలతో అదరగొట్టిన సముద్ర ఖని. దర్శకుడిగానూ సినిమాలు చేసి మెప్పించారు సముద్రఖని. తాజాగా ఆయన ఓ హీరో గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఆ హీరో మనసు బంగారం.. కళ్ళజోడు కావాలని అడిగితే షాపే కొనిస్తా అన్నాడు..
Samudrakani

Updated on: Mar 31, 2026 | 11:51 AM

ప్రముఖ దర్శకుడు, నటుడు సముద్రఖని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటుడిగా ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన ఆయన.. దర్శకుడిగానూ సినిమాలు చేసి హిట్స్ అందుకున్నాడు. అలవైకుంఠపురంలో, క్రాక్, భీమ్లానాయక్ లాంటి సినిమాలతో అదరగొట్టిన సముద్ర ఖని. ఇప్పుడు దర్శకుడిగానూ రాణిస్తున్నారు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి, ఆయన నటనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సర్కారు వారి పాట చిత్రంలో కలిసి పనిచేసిన అనుభవాన్ని వివరిస్తూ, మహేష్ బాబు కేవలం ఒక అద్భుతమైన నటుడు మాత్రమే కాదని, అంతకు మించి గొప్ప మానవత్వం ఉన్న వ్యక్తి అని పేర్కొన్నారు సముద్రఖని. ఇలాంటి వ్యక్తులతో కలిసి పనిచేయడం తమకు ఎల్లప్పుడూ సంతోషాన్నిస్తుందని, వారి ప్రయాణంలో భాగం కావాలని కోరుకుంటానని సముద్రఖని అన్నారు.

ఆమె హీరోయినా.. అస్సలు వద్దు..! డైరెక్టర్‌కు మొహం మీదే చెప్పిన విజయ్ సేతుపతి

అలాగే సముద్రఖని ఒక ప్రత్యేకమైన సంఘటనను గుర్తు చేసుకున్నారు. సర్కారు వారి పాట చిత్రీకరణ సమయంలో ఆయన మహేష్ బాబును ఒక కళ్లజోడు అడిగారట. దానికి మహేష్ బాబు స్పందిస్తూ ఒక కళ్లజోడు ఏమిటి, ఒక షాప్ నే ఇప్పిస్తాను” అని సరదాగా అన్నారని సముద్రఖని తెలిపారు. మరుసటి రోజు మహేష్ బాబు వెంటనే ఒక పెట్టె నిండా వివిధ రకాల కళ్లజోళ్లను పంపించి, సముద్రఖని తనకు నచ్చిన కళ్లజోడును ఎంపిక చేసుకోమని సూచించారట. ఈ సంఘటన మహేష్ బాబులోని ఔదార్యాన్ని, ఇతరుల పట్ల ఆయనకున్న అభిమానాన్ని స్పష్టం చేస్తుందని తెలిపారు. సముద్రఖనికి ఆ కళ్లజోళ్లు చాలా ఇష్టమని, ఆ బహుమతి పట్ల ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

రూ.10తో మొదలుపెట్టింది.. కట్ చేస్తే ఇండస్ట్రీనే ఏలింది..! పెళ్లైన నిర్మాతతో ఎఫైర్‌

సముద్రఖని సర్కారు వారి పాట సినిమా తనకు గొప్ప గుర్తింపు తెచ్చిపెట్టిందని, ఆ ఫేమ్‌ను పూర్తిగా ఆస్వాదిస్తూ తన పాత్రను పోషించానని తెలిపారు. మహేష్ బాబుతో తన బంధం కేవలం వృత్తిపరమైనది మాత్రమే కాదని, వ్యక్తిగత స్థాయిలో కూడా చాలా బలమైనదని ఆయన అన్నారు. అలాగే నటించడం గురించి మాట్లాడుతూ.. దర్శకులు పిలిచినప్పుడు నిశ్శబ్దంగా వెళ్లి తమ పాత్రను పోషించి రావడమే తమ పని అని, వారు ఖచ్చితంగా పిలుస్తారని తాను కూడా ఎదురుచూస్తున్నానని ఆయన అన్నారు. ప్రస్తుతం వారణాసి చిత్రంలో తన పాత్ర గురించి అడగగా, ఇంకా పిలవలేదని, అన్నయ్య( రాజమౌళి) పిలిస్తే వెళ్తానని అన్నారు సముద్రఖని.

రూ.10తో మొదలుపెట్టింది.. కట్ చేస్తే ఇండస్ట్రీనే ఏలింది..! పెళ్లైన నిర్మాతతో ఎఫైర్‌

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us