ఒక సీన్ కోసం 37 టేకులు తీసుకున్న నటి రమ్యకృష్ణ

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 2:21 PM

ఎన్నో సినిమాల్లో తన అందచందాలతో, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రముఖ నటి రమ్యకృష్ణ. బాహుబలి సినిమాతో ఆమె క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఈ మధ్యనే విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న సూపర్ డీలక్స్ సినిమాలోని ఒక పోర్న్ స్టార్‌గా రమ్యకృష్ణ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. నటిగా అపారమైన టాలెంట్ ఉన్న రమ్యకృష్ణ ఈ సినిమాలోని ఒక సీన్ కోసం ఏకంగా 37 టేకులు తీసుకున్నారట. ప్రస్తుతం ఈ విషయమే హాట్ టాపిక్ అయింది. ఈ […]

ఒక సీన్ కోసం 37 టేకులు తీసుకున్న నటి రమ్యకృష్ణ
Follow us on

ఎన్నో సినిమాల్లో తన అందచందాలతో, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రముఖ నటి రమ్యకృష్ణ. బాహుబలి సినిమాతో ఆమె క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఈ మధ్యనే విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న సూపర్ డీలక్స్ సినిమాలోని ఒక పోర్న్ స్టార్‌గా రమ్యకృష్ణ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. నటిగా అపారమైన టాలెంట్ ఉన్న రమ్యకృష్ణ ఈ సినిమాలోని ఒక సీన్ కోసం ఏకంగా 37 టేకులు తీసుకున్నారట. ప్రస్తుతం ఈ విషయమే హాట్ టాపిక్ అయింది.

ఈ విషయంపై రమ్యకృష్ణ స్పందిస్తూ ‘ఇది నా కెరీర్లో ఛాలెంజింగ్ రోల్.. కొన్ని పాత్రలు పేరు కోసం.. మరికొన్ని డబ్బుకోసం.. ఇంకొన్ని పాత్రలు ష్యాషన్‌తో చేస్తాము.. అలా ఫ్యాషన్‌తో చేసిన పాత్రనే ఇది.. అని రమ్యకృష్ణ చెప్పడం.. అందరిలో మరింత ఆసక్తిని పెంచుతోంది. కుమార రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాను, మార్చి 29వ తేదీన తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేయనున్నారు.