మీరు గ్రేట్ సార్.. ఆ నటుడి కుమారుడి చదువుకు హీరో శివ కార్తికేయన్ సాయం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?

కుడి చేత్తో చేసే సాయం ఎడమ చేతికి కూడా తెలియకూడదంటారు. ఆ మాటను అక్షరాలా నిజం చేస్తున్నాడు హీరో శివ కార్తికేయన్. ఇప్పటికే ఎన్నో గుప్త దానాలు చేసిన హీరో మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఓ నటుడి చదువు కోసం ఏకంగా ..

మీరు గ్రేట్ సార్.. ఆ నటుడి కుమారుడి చదువుకు హీరో శివ కార్తికేయన్ సాయం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?
Sivakarthikeyan

Updated on: Apr 14, 2026 | 6:35 AM

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పేరకు తమిళ హీరోనే అయినా తెలుగులోనూ ఈ నటునికి పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా అమరన్ సినిమా శివ కార్తికేయన్ కు పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తీసుకొచ్చింది. గతేడాది మదరాసి సినిమాతో ఆకట్టుకున్న ఈ హీరో ఈ సంక్రాంతికి పరాశక్తి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమాల సంగతి పక్కన పెడితే.. స్వయం కృషితో ఎదిగిన హీరో శివ కార్తికేయన్ కు సామాజిక స్పృహ ఎక్కువ. అందుకే సామాజిక బాధ్యతగా తన వంతు కొన్ని మంచి కార్యక్రమాలు చేపడుతుంటాడు. అయితే ఇక్కడ గుర్తించాల్సిన విషయమేమిటంటే.. తాను చేసిన మంచి పనుల గురించి ఎక్కడా ప్రచారం చేసుకోరు శివ కార్తికేయన్. అయితే కొన్ని సందర్భాల్లో అతనితో లబ్ధి పొందిన వారు ఈ హీరో గొప్ప తనం గురించి మాట్లాడుతుంటారు. అలా చాన్నాళ్ల క్రితం శివ కార్తికేయన్ సాయం పొందిన ఓ నటుడు ఇప్పుడు ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. వివరాల్లోకి వెళితే..

శివకార్తికేయన్ నటించిన ‘హీరో’ సినిమాలో కోలీవుడ్ నటుడు ప్రేమ్ కుమార్ కూడా యాక్ట్ చేవాడు. అయితే ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో తన కొడుకు చదువు కోసం నెదర్లాండ్స్ వెళ్లాలని, సమయానికి చేతిలో డబ్బుల్లేవని.. పోని ఇల్లు తాకట్టు పెడదామా అంటే అది ఈఎమ్ఐలో ఉండటంతో బ్యాంకులు అప్పు ఇచ్చేందుకు నిరాకరించాయని ప్రేమ్ వాపోయాడట. ఈ విషయం శివకార్తికేయన్‌కి చెప్పగా బ్యాంకులో తన పేరిట పూచీకత్తుగా రూ.50 లక్షలు ఇప్పించాడట. అలా తనకు సాయం చేయడంతో ఇప్పుడు తన కొడుకు నెలకు రూ.4-5 లక్షలు సంపాదిస్తున్నాడని, దీనంతటికీ శివకార్తికేయన్ కారణమని ప్రేమ్ కుమార్ ఇటీవల చెప్పుకొచ్చాడు. కాగా ప్రేమ్ కుమార్-శివకార్తికేయన్ కలిసి ఓ సినిమాకు మాత్రమే పనిచేశారు. పరిచయం కూడా కొన్నాళ్లముందే జరిగింది. అయినా సరే తనని శివకార్తికేయన్ ఆదుకున్నాడని ప్రేమ్ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు శివ కార్తికేయన్ పై ప్రశంసల వర్షం కురపిస్తున్నారు. మీరు రియల్ హీరో అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నాను.

ఇవి కూడా చదవండి

కాగా ప్రస్తుతం హీరోగానూ, నిర్మాతగానూ బిజీ బిజీగా ఉంటున్నారు శివ కార్తికేయన్. రీసెంట్‌గా ‘తాయ్ కిళవి’ మూవీతో నిర్మాతగానూ ఈ హీరో సూపర్ హిట్ కొట్టాడీ హీరో. ఇక అతను ప్రధాన పాత్రలో నటిస్తోన్న సెయాన్ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

వీడియోఇదిగో..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us