Singer KK Death: మనసుకు బాధ కలిగింది.. చివరి వరకు పాటతోనే ఉన్నారు.. కేకే మృతి పై పవన్ కళ్యాణ్ ఎమోషనల్..

కె.కె.గా సుపరిచితులైన ప్రముఖ గాయకుడు శ్రీ కృష్ణకుమార్ కున్నత్ గారి అకాల మరణం బాధ కలిగించింది. సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక బాణీని కలిగిన గాయకుడు శ్రీ కె.కె. గారు.

Singer KK Death: మనసుకు బాధ కలిగింది.. చివరి వరకు పాటతోనే ఉన్నారు.. కేకే మృతి పై పవన్ కళ్యాణ్ ఎమోషనల్..
Pawan Kk

Updated on: Jun 01, 2022 | 2:52 PM

ప్రముఖ సింగర్ కేకే (KK) మరణంతో సంగీత ప్రపంచంలో విషాదం అలుపుముకుంది. కేకే హఠాన్మారణంతో సినీ ప్రముఖులు, అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. ఆయన మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లోని నజ్రుల్ మంచ్ ఈవెంట్ లో లైవ్ షో ఇస్తున్న సమయంలో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు కేకే. ప్రదర్శన అనంతరం తన గదికి వచ్చిన ఆయన ఛాతిలో భారంగా ఉందంటూ కుప్పకూలిపోయారు. వెంటనే కలకత్తా మెడికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కి తీసుకెళ్లారు.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేకే మరణం పట్ల టాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేకే మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

“కె.కె.గా సుపరిచితులైన ప్రముఖ గాయకుడు శ్రీ కృష్ణకుమార్ కున్నత్ గారి అకాల మరణం బాధ కలిగించింది. సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక బాణీని కలిగిన గాయకుడు శ్రీ కె.కె. గారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. నా చిత్రాల్లో ఆయన ఆలపించిన గీతాలు అభిమానులను, సంగీత ప్రియులను అమితంగా మెప్పించాయి. ఖుషీ చిత్రం కోసం ‘ఏ మేరా జహా’ గీతం అన్ని వయసులవారికీ చేరువైంది. అందుకు శ్రీ కె.కె. గారి గాత్రం ఓ ప్రధాన కారణం. ‘జల్సా’లో మై హార్ట్ ఈజ్ బీటింగ్… అదోలా’, ‘బాలు’ ‘ఇంతే ఇంతింతే’, ‘జానీ’లో ‘నాలో నువ్వొక సగమై’, ‘గుడుంబా శంకర్’లో ‘లే లే లే లే’.. గీతాలను నా చిత్రాల్లో ఆయన పాడారు. అవన్నీ శ్రోతలను ఆకట్టుకోవడమే కాదు… సంగీతాభిమానులు హమ్ చేసుకొనేలా సుస్థిరంగా నిలిచాయి. సంగీత కచేరీ ముగించుకొన్న కొద్దిసేపటికే హఠాన్మరణం చెందటం దిగ్భ్రాంతికరం. ఆయన చివరి శ్వాస వరకూ పాడుతూనే ఉన్నారు. శ్రీ కె.కె. గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఆ కుటుంబానికి భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలి” అంటూ పవన్ కళ్యాణ్ ఎమోషనల్ ట్వీట్ చేశారు.