
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం ‘రణబాలి’. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కించిన ఈ పీరియడికల్ యాక్షన్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న రణబాలి రేపుఅక్టోబర్ 16) ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఇప్పటికే థియేటర్ల వద్ద రణబాలి సందడి కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో న్యాచురల్ స్టార్ నాని ‘రణబాలి’ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ‘రణబాలి’ సినిమా కోసం చిత్ర బృందం ఎంతో కష్టపడింది. కథ ప్రాధాన్యతను గుర్తించి, ప్రతి విషయంలోనూ ఎంతో శ్రద్ధ తీసుకున్నట్లు సినిమా ప్రచార చిత్రాలు చూస్తుంటే అర్థమవుతోంది. ఇప్పటివరకు అందరికీ తెలిసిన కూల్ విజయ్ దేవరకొండ నుంచి ‘రణబాలి’ అనే ఉగ్రరూపం దాల్చిన వ్యక్తిగా ఆయన మారిన తీరు స్ఫూర్తిదాయకంగా ఉంది. విజయ్ తన పాత్ర కోసం ఎంతో సహజంగా మారిపోయాడు. జయమ్మగా రష్మిక ఎంతో సహజంగా, ఆకట్టుకునేలా ఉంది. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ ట్యాలెంట్ కనిపిస్తోంది. చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్’ అని విషెస్ చెప్పారు నాని.
కాగా విజయ్- రష్మికలతో నానికి మంచి అనుబంధం ఉంది. అలాగే రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నాని హీరోగా శ్యామ్ సింగరాయ అనే బ్లాక్ బస్టర్ మూవీ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో రణబాలి చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు నాని. ఇక రణబాలి సినిమా విషయానికి వస్తే.. పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటిస్తోన్న మొదటి సినిమా ఇదే. దీనికి తోడు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించింది. హాలీవుడ్ స్టార్ హీరో ఆర్నాల్డ్ ఓస్లో ఈ మూవీలో మెయిన్ విలన్ గా నటించడం విశేషం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.