AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Nani : చాలా చెత్త టైటిల్ అన్నారు.. నేను ఒక్కడినే నమ్మాను.. కట్ చేస్తే.. సినిమా బ్లాక్ బస్టర్ హిట్.. హీరో నాని..

న్యాచురల్ స్టార్ నాని సినిమాలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీరంగంలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. అష్టాచెమ్మా, భలే భలే మగాడివోయ్, మిడిల్ క్లాస్ అబ్బాయి, శ్యామ్ సింగరాయ్ వంటి సూపర్ హిట్ చిత్రాలతో కోట్లాది మంది అభిమానుల హృదయాలు గెలుచుకున్నారు.

Actor Nani : చాలా చెత్త టైటిల్ అన్నారు.. నేను ఒక్కడినే నమ్మాను.. కట్ చేస్తే.. సినిమా బ్లాక్ బస్టర్ హిట్.. హీరో నాని..
Nani
Rajitha Chanti
|

Updated on: May 11, 2026 | 8:41 AM

Share

న్యాచురల్ నాని క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసిస్టెండ్ డైరెక్టర్ గా సినీ ప్రయాణం స్టార్ట్ చేసి… ఆ తర్వాత అష్టా చెమ్మా సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే హీరోగా ప్రశంసలు అందుకున్న నాని.. తర్వాత విభిన్న కంటెంట్ కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తన సహజ సిద్ధమైన నటనతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. పిల్ల జమీందార్, ఈగ, ఎవడే సుబ్రమణ్యం, భలే భలే మగాడివోయ్, జెర్సీ, శ్యామ్ సింగరాయ్, దసరా, సరిపోదా శనివారం వంటి చిత్రాలు ఆయన కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచాయి. అయితే నాని కెరీర్ మలుపు తిప్పిన సినిమా అలా మొదలైంది. 2011లో విడుదలైన ఈ మూవీ అనుహ్య విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతోనే ఆయన తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.

ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..

ఇందులో నాని ‘గౌతమ్’ పాత్రలో నటించగా, నిత్యా మీనన్ ఈ సినిమాతోనే టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కేవలం రూ.4 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.15 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం నానికి స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టడమే కాకుండా, నందినీ రెడ్డికి ఉత్తమ తొలి చిత్ర దర్శకురాలిగా నంది అవార్డును కూడా తెచ్చిపెట్టింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ.. అలా మొదలైంది టైటిల్‌ను ఖరారు చేసిన సమయంలో ఎదురైన విమర్శలను గుర్తు చేసుకున్నారు. నాని తన 16 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎదురైన అనుభవాలను పంచుకుంటూ, ‘అలా మొదలైంది’ సినిమాకు ఆ పేరు పెట్టినప్పుడు చాలా మంది పెదవి విరిచారని తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..

. “మేము ఆ టైటిల్ పెట్టినప్పుడు అది చాలా చెత్త టైటిల్ అని, అసలు ఇదేం పేరు అని అందరూ విమర్శించారు. కానీ నేను ఒక్కడినే నమ్మాను” అని అన్నారు. చిత్ర యూనిట్ లో కూడా చాలా మందికి ఈ పేరుపై నమ్మకం లేదని ఆయన వెల్లడించారు. అందరూ వ్యతిరేకించినప్పటికీ, దర్శకురాలు నందినీ రెడ్డి, నాని మాత్రం ఆ టైటిల్ ఒక ప్రేమకథకు పర్ఫెక్ట్‌గా సరిపోతుందని బలంగా నమ్మారు. సినిమా విడుదలయ్యే వరకు ఒక్క పాజిటివ్ రిమార్క్ కూడా ఆ టైటిల్‌పై రాలేదని, కానీ సినిమా విడుదలై ఘనవిజయం సాధించిన తర్వాత అందరి అభిప్రాయాలు మారిపోయాయని నాని వివరించారు. సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత, “అలా మొదలైంది” కాకుండా ఈ సినిమాకు మరో పేరును ఊహించుకోలేం అని అందరూ అన్నారని తెలిపారు. దాదాపు తన 10 సినిమాల విషయంలో ఇలాంటి అనుభవమే ఎదురైందని నాని చెప్పుకొచ్చారు. మనకు ఒక సినిమా నచ్చితే దాని టైటిల్ కూడా అద్భుతంగా అనిపిస్తుందని, అదే సినిమా నచ్చకపోతే ఏదీ బాగుండదని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం నాని చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..

ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‏గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..

Follow Us