న్యాచురల్ స్టార్ నాని (Nani) ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం అంటే సుందరానికీ (Ante Sundaraniki).. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మలయాళ బ్యూటీ నజ్రీయా నజీమ్ కథానాయికగా నటిస్తోంది. తెలుగులో నజ్రీయా నటిస్తోన్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్ మూవీపై మరింత క్యూరియాసిటీని పెంచేశాయి. మరోవైపు అంటే సుందరానికీ పాటలకు సైతం మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో హిందూ అబ్బాయి సుందరం పాత్రలో నాని నటిస్తుండగా.. క్రిస్టియన్ అమ్మాయి లీలా థామస్ పాత్రలో నజ్రీయా కనిపించనుంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియాతో ముచ్చటించిన నాని.. మరోసారి సినిమా టికేట్స్ రేట్స్ పై పలు ఆసక్తికర కామెంట్స్ చేశాడు..
ఈ క్రమంలోనే టికెట్ రేట్లు పెంచమని అడిగారు.. కానీ ఇప్పుడు నిర్మాతలే స్వతహాగా తగ్గిస్తున్నారు కదా ? అని విలేకరి అడగ్గా.. నాని స్పందిస్తూ.. “ఈ కామెంట్లు సోషల్ మీడియాలో నా వరకూ వచ్చాయి. అయితే ఇక్కడ ఒక విషయంలో క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నా. నేను టికెట్ రేట్లు పెంచమని చెప్పినపుడు సందర్భం వేరు. బేసిక్ రేట్లు కంటే బాగా తగ్గించి టికెట్ మరీ ముఫ్ఫై, నలభై రూపాయిలు చేసినప్పుడు .. ఇంత తక్కువ ధరతో సినిమా ఆడించడం కష్టం బేసిక్ రేట్లు పెట్టమని కోరాను. ఆర్ ఆర్ ఆర్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకోవచ్చు. నేను కూడా మిగతా సినిమాలకి రేట్లు పెంచమని అడగలేదు కదా. బేసిక్ రేట్లు కంటే తగ్గించేసినపుడు ఎవరూ బ్రతకలేరని చెప్పాను. నేనేం ఎక్కువ అడగలేదు. ముందువున్న బేసిక్ రేట్లు ఉంచమనే కోరాను. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బడ్జెట్ కానీ ఆ సందర్భం మర్చిపోయి ఇలా కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు కదా ” అంటూ చెప్పుకొచ్చారు. ఈ సినిమాతోపాటు దసరా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నాని సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది.