Akkineni Nagarjuna: నారాయణ పదంపై నాగార్జున క్లారిటీ.. ‘ఎవరికీ కౌంటర్ కాదు.. సరదాగానే అన్నానంటూ..

తాజాగా ఈ వివాదంపై స్పందించారు నాగార్జున. తాజాగా బ్రహ్మాస్త్ర మూవీ గురించి మీడియాతో ముచ్చటించిన నాగార్జున బిగ్ బాస్ ఇష్యూపై కూడా క్లారిటీ ఇచ్చారు.

Akkineni Nagarjuna: నారాయణ పదంపై నాగార్జున క్లారిటీ.. ఎవరికీ కౌంటర్ కాదు.. సరదాగానే అన్నానంటూ..
Nagarjuna

Updated on: Sep 15, 2022 | 8:23 AM

బిగ్ బాస్ షోపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో వల్ల ఎలాంటి ఉపయోగం లేదంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే నారాయణ వ్యాఖ్యలపై అటు షో నిర్వాహకులు గానీ.. ఇటు హోస్ట్ నాగార్జున (Akkineni Nagarjuna) గానీ నేరుగా స్పందించలేదు. కానీ ఇటీవల గత వీకెండ్ ఎపిసోడ్‏లో ఒకానొక సందర్భంలో నాగార్జున మాట్లాడుతూ.. నారాయణ నారాయణ వాళ్లిద్దరూ భార్యభర్తలు అని అన్నారు. దీంతో ఆయన సీపీఐ నారాయణకు ఇన్ డైరెక్ట్ కౌంటర్ వేశారంటూ నెట్టింట ప్రచారం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న నారాయణ కూడా నాగార్జునకు తనస్టైల్లో రీకౌంటర్ ఇచ్చారు. తాజాగా ఈ వివాదంపై స్పందించారు నాగార్జున. తాజాగా బ్రహ్మాస్త్ర మూవీ గురించి మీడియాతో ముచ్చటించిన నాగార్జున బిగ్ బాస్ ఇష్యూపై కూడా క్లారిటీ ఇచ్చారు.

తనకు బిగ్ బాస్ కంటెస్టెంట్ గా చేసే ఉద్దేశ్యం లేదన్నారు. అలాగే తనకు ఏదైనా నచ్చకపోతే బై చెప్పి వెళ్లిపోతా అని.. కానీ బిగ్ బాస్ లో అలా కుదరదని.. వందరోజులు కచ్చితంగా ఉండాల్సిందే అన్నారు. ఇక నారాయణ నారాయణ అని కేవలం సరదాగానే అన్నాను అని.. ఎవరికీ కౌంటర్ వేయలేదన్నారు. గత సీజన్లలోనూ ఈ పదాన్ని అనేకసార్లు వాడానని.. అంతేకానీ ఎవరికీ ఉద్దేశించి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, అలియా జంటగా నటించిన బ్రహ్మాస్త్ర సినిమాలో నాగార్జున కీలకపాత్రలో నటించారు. ఈ సినిమాను అయాన్ ముఖర్జీ తెరకెక్కించారు. సెప్టెంబర్ 9న పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన వస్తోంది. ఇందులో మౌనీరాయ్, షారుఖ్ ఖాన్ సైతం కీలకపాత్రలలో నటించారు.