Mammootty: ఒక రోజు వ్యవధిలో.. మమ్ముట్టి , మోహన్ లాల్ ఇళ్లల్లో తీవ్ర విషాదాలు.. శోకసంద్రంలో కుటుంబీకులు

సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం (జూన్ 10) రాత్రి టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ కేఎస్ రవి కుమార్ చౌదరి గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇది మరవక ముందే సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది.

Mammootty: ఒక రోజు వ్యవధిలో.. మమ్ముట్టి , మోహన్ లాల్ ఇళ్లల్లో తీవ్ర విషాదాలు.. శోకసంద్రంలో కుటుంబీకులు
Mohan Lal, Mammootty

Updated on: Jun 11, 2025 | 2:34 PM

ప్రముఖ మలయాళ నటుడు, సూపర్ స్టార్ ముమ్మట్టి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నటుడి మామ పీఎస్ అబు (92) బుధవారం (జూన్ 11) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన వృద్ధాప్య సమస్యలతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే బుధవారం పీఎస్ అబూ తుది శ్వాస విడిచారు. పీఎస్ అబూకు మమ్ముట్టి భార్య సుల్ఫత్ కుట్టి సహా నలుగురు పిల్లలు ఉన్నారు. చనిపోవడంతో ప్రస్తుతం మమ్ముట్టి కుటుంబంలో శోకసంద్రంలో ఉంది. కాగా మమ్ముట్టి మామ చనిపోవడానికి సరిగ్గా ఒకరోజు ముందు అంటే మంగళవారం (జూన్10) ఇదే మలయాళ ఇండస్ట్రీకి చెందిన మరో సూపర్ స్టార్ హీరో మోహన్ లాల్ ఇంట్లోనూ విషాదం చోటు చేసుకుంది. ఆయన మేనమామ గోపీనాథ్ నాయర్ తుదిశ్వాస విడిచారు. గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం తనువు చాలించారు. ఇలా ఒక రోజు వ్యవధిలో ఇద్దరు స్టార్ హీరోల ఇళ్లలో విషాదం నెలకొంది. ఈ క్రమంలోనే సినీ అభిమానులు తమ హీరోలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. మమ్ముట్టి ఇటీవల నటించిన భ్రమయుగం, టర్బో, బజుక సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఆయన చేతిలో మరిన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. దుల్కర్ నటించిన లక్కీ భాస్కర్ సినిమా ఏకంగా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.

ఒక రోజు వ్యవధిలో రెండు విషాదాలు..

Mammootty Father In Law P S

ఇక మోహన్ లాల్ విషయానికి వస్తే.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడీ సీనియర్ హీరో. మోహన్ లాల్ హీరోగా నటించిన ఎంపురాన్ ఎల్ 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక ఇటీవలే రిలీజైన తుడ్‌రుమ్ కూడా వంద కోట్ల క్లబ్ లో చేరింది.

మోహన్ లాల్ మేనమామ..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.