first look poster of ”Boys” : సినిమా రంగంలో, బిజినెస్ రంగంలో రాణిస్తూ సక్సెస్ విమెన్ గా దూసుకు పోతున్న మిత్ర శర్మ తాజాగా ప్రొడక్షన్ హౌస్ స్థాపించి సినిమాలు నిర్మిస్తున్నారు. శ్రీ పిక్చర్స్ పతాకంపై మిత్ర శర్మ, గీతనంద్ జంటగా దయానంద్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ మిత్ర శర్మ నిర్మిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ చిత్రం “బాయ్స్”. దీనికి (బాయ్స్ విల్ బి బాయ్స్) అన్నది ట్యాగ్ లైన్. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ వేడుక హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన హీరో కార్తికేయ ,”బాయ్స్” ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.
ముఖ్య అతిధిగా వచ్చిన హీరో కార్తికేయ మాట్లాడుతూ.. మిత్ర శర్మ సినిమా, బిజినెస్ రంగాల్లో రాణిస్తూ ఈ రోజు ప్రొడక్షన్ హౌస్ స్థాపించి సినిమా నిర్మిస్తుంది.బాయ్స్ అయిన మనమే భయపడి వెనుకడుగు వేస్తాము అలాంటిది తాను బ్యానర్ పెట్టి “బాయ్స్” మూవీ తీస్తుంది. నా మూవీ షూట్ లో ఉండగా ఈ మూవీ గురించి,మిత్ర గురించి విన్నాను.తను “బాయ్స్” మూవీ లో హీరోయిన్ గా చేస్తూ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుందని విని షాక్ అయ్యాను.ఎందుకంటే ఎక్కువగా హీరో గా చేస్తూ సినిమాలను ప్రొడ్యూస్ చేస్తుంటారు.తను ఎంతో డేరింగ్ స్టెప్ తీసుకొని చేస్తున్న ఈ సినిమా టైటిల్ క్యాచీగా బాగుంది. అప్పట్లో శంకర్ తీసిన “బాయ్స్” మూవీ అంత పెద్ద హిట్ అవ్వాలి. ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న పెద్ద బ్యానర్ ల సరసన ఈ బ్యానర్ నిలిచి పెద్ద సినిమాలు నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానని అన్నారు..
మరిన్ని ఇక్కడ చదవండి :
Ek Mini Katha Movie: మేర్లపాక గాంధీ-యువి కాంబినేషన్ లో రానున్న ఏక్ మినీ కథ.. హీరోగా సంతోష్ శోభన్