Karthikeya: నేను ఆ మాటలు అనలేదు.. దయచేసి అలా పోస్ట్ చేయకండి.. హీరో కార్తికేయ ట్వీట్..

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తీకేయ పలు ఆసక్తికర కామెంట్స్ చేశాడు. "ఆర్ ఎక్స్ 100 తర్వాత నన్ను రొమాంటిక్ సీన్స్ లో చూసేందుకు అడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇక డీజే టిల్లు సినిమాతో నేహా రొమాంటిక్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఆయా చిత్రాల్లో మా పాత్రలకు.. ఈ సినిమాలోని పాత్రలకు ఎలాంటి సంబంధం లేదు. ఈ కథలోనే ఓ రొమాంటిక్ సీన్ ఉంది. మాపై రొమాంటిక్ ఇమెజ్ ఉంది. దీంతో మా ఇద్దరిని ఎంచుకున్నారు" అని అన్నారు.

Karthikeya: నేను ఆ మాటలు అనలేదు.. దయచేసి అలా పోస్ట్ చేయకండి.. హీరో కార్తికేయ ట్వీట్..
Karthikeya

Updated on: Aug 14, 2023 | 10:41 PM

ఆర్ ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యారు కార్తికేయ. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత కార్తికేయకు ఇప్పటివరకు సరైన హిట్ పడలేదు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. కేవలం హీరోగానే కాకుండా విలన్ గానూ మెప్పిస్తున్నారు. తమిళ్ స్టార్ హీరో అజిత్ నటించిన వలిమై సినిమాతో ప్రతినాయకుడిగా కనిపించి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా బెదురులంక 2012. ఇందులో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా కార్తికేయ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తీకేయ పలు ఆసక్తికర కామెంట్స్ చేశాడు. “ఆర్ ఎక్స్ 100 తర్వాత నన్ను రొమాంటిక్ సీన్స్ లో చూసేందుకు అడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇక డీజే టిల్లు సినిమాతో నేహా రొమాంటిక్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఆయా చిత్రాల్లో మా పాత్రలకు.. ఈ సినిమాలోని పాత్రలకు ఎలాంటి సంబంధం లేదు. ఈ కథలోనే ఓ రొమాంటిక్ సీన్ ఉంది. మాపై రొమాంటిక్ ఇమెజ్ ఉంది. దీంతో మా ఇద్దరిని ఎంచుకున్నారు” అని అన్నారు.

ఇవి కూడా చదవండి

కార్తికేయ ట్వీట్..

అయితే కార్తికేయ మాటలను ఉద్దేశిస్తూ ఓ నెటిజన్ పోస్టర్ క్రియేట్ చేశారు. ఆర్ఎక్స్ 100తో నాకు.. డీజే టిల్లుతో నేహాకు రొమాంటిక్ ఇమేజ్ వచ్చింది. మా కాంబో పై కొన్ని అంచనాలు ఉంటాయి. అందుకే ఈ సినిమాలో కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి అని కార్తికేయ చెప్పినట్లు ఆ పోస్టర్ లో రాసుకొచ్చాడు.

కార్తికేయ ఇన్ స్టా పోస్ట్..

దీంతో అసహానికి గురైన కార్తికేయ రియాక్ట్ అవుతూ.. ఇలాంటివి పోస్ట్ చేసేముందు దయచేసి పూర్తి ఇంటర్వ్యూ చూడండి. నేను ఈ మాటలు అనలేదు. నటీనటుల ఇమేజ్ లేదా సినిమాను దెబ్బతీసేలా ఇలాంటి పోస్టులను దయచేసి పోస్ట్ చేయకండి అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం కార్తికేయ ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.

కార్తికేయ ఇన్ స్టా పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.