Jagapathi Babu: లెజెండ్ సినిమాలో నాకు అన్యాయం జరిగింది.. జగపతి బాబు సంచలన వ్యాఖ్యలు..

జగపతి బాబు ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్‏కు ఫేవరేట్ హీరో. చాలా కాలం పాటు.. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలకు ధీటుగా

Jagapathi Babu: లెజెండ్ సినిమాలో నాకు అన్యాయం జరిగింది.. జగపతి బాబు సంచలన వ్యాఖ్యలు..
Jagapathi Babu

Updated on: Aug 26, 2021 | 5:29 PM

జగపతి బాబు ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్‏కు ఫేవరేట్ హీరో. చాలా కాలం పాటు.. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలకు ధీటుగా సినీ పరిశ్రమలో టాప్ రేసులో దూసుకుపోయాడు. ఆ తర్వాత కొన్ని వ్యక్తిగత విషయాలతో సినిమాలకు దూరంగా ఉన్నాడు జగపతి బాబు.. ఇక ఆ తర్వాత బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన లెజెండ్ సినిమాతో తిరిగి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చారు జగపతి బాబు. ఈ సినిమాలో పవర్‏ఫుల్ విలన్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అందులోని జగపతి బాబు నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. హీరోగానే కాకుండా.. విలన్ పాత్రలలోనూ జగపతి బాబు తన నటనతో అదుర్స్ అనిపించాడు. ఆ సినిమా తర్వాత జగ్గుభాయ్‏కి వరుస ఆఫర్లు తలుపు తట్టాయి. ప్రస్తుతం జగపతి బాబు.. క్యారెక్టర్ ఆర్టీస్ట్‏గా ఫుల్ బిజీ ఆయ్యాడు. ఇదిలా ఉంటే.. తాజాగా తనకు లెజెండ్ సినిమా విషయంలో అన్యాయం జరిగిందంటూ ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు జగ్గుభాయ్. అందులో విలన్ పాత్రను పవర్‏ఫుల్‏గా చూపించలేదని చెప్పుకొచ్చాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో జగపతి బాబు మాట్లాడుతూ.. లెజెంట్ సినిమాల నాకు జరిగిన అన్యాయం మీ అందరికి తెలుసు. ఈ సినిమా ఫైట్ల విషయంల చెప్పింది ఒకటి. చేసింది మరొకటి. అందులో హీరోకు ధీటుగా విలన్ పాత్ర ఉంటుందని చెప్పి నన్ను తీసుకున్నారు. కానీ ఆ స్థాయిలో నా పాత్ర చూపించలేదు అంటూ నిర్మోహమాటంగా జగపతి బాబు చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక జగపతి బాబు వ్యాఖ్యలపై నెటిజన్లు విభిన్నరకాలుగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం జగపతి బాబు.. శర్వానంద్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మహా సముద్రం సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న రిపబ్లిక్ మూవీలో కీలక పాత్రలో కనిపించనున్నారు.

ట్వీట్..

Also Read: Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి-బాబీ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. టైటిల్ ఫిక్స్ చేసిన మేకర్స్…

NET Trailer Review: ఆద్యంతం ఆసక్తికరంగా అవికా గోర్ నెట్ ట్రైలర్..