
ఒకప్పుడు జగపతి బాబు.. ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఫేవరేట్ హీరో. స్టార్ హీరోలలో ఒకరిగా కొన్ని ఏళ్ల పాటు కొనసాగాడు. కంటెంట్ ప్రాధాన్యత చిత్రాలను చేసేందుకు జగ్గూభాయ్ ముందుండేవారు. స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయంలోనే అనుహ్యాంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. ఇక కొంత కాలం తర్వాత గ్యాప్ విలన్ గెటప్‌లో రీంట్రీ ఇచ్చారు. నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమాతో తిరిగి వెండి తెరపైకి ఎంట్రీ ఇచ్చారు.
లెజెండ్ సినిమాలో జగ్గూభాయ్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ మూవీ తర్వాత జగపతి బాబు వరుసగా.. విలన్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ బిజీగా గడిపేస్తున్నాడు. ప్రస్తుతం జగ్గూభాయ్.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సలార్ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. అలాగే శర్వానంద్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న మహా సముద్రం మూవీలోనూ కనిపించనున్నాడు. అలాగే సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న రిపబ్లిక్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా జగ్గూభాయ్.. తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికర ట్వీట్ చేశాడు.
సినిమాల నుంచి కాస్త విరామం దొరకడంతో జగ్గుభాయ్ అమెరికాకు వెళ్లిపోయారు. తన పెంపుడు కుక్కతో ఆడుకుంటున్న ఫోటోను షేర్ చేసిన ఆయన.. తన కుటుంబంతో..తనకు ఇష్టమైన పెట్స్‌తో.. ఇంకా తన పుస్తకాలతో సరదాగా సమయం గడపడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. పెంపుడు జంతువులది స్వార్థం లేని ప్రేమ అని.. బుక్స్, పెట్స్.. చాలా బెస్ట్ అని.. మనుషులు వాటిని చూసి ఎంతో నేర్చుకోవాలంటూ ట్వీట్ చేశారు జగ్గూభాయ్.
ట్వీట్..
Also Read: Saptagiri : సప్తగిరి ‘గూడుపుఠాణి’.. గ్రామీణ నేపథ్యంలో సాగే కథ.. ఆకట్టుకుంటున్న ట్రైలర్..
Manchu Manoj : సైదాబాద్ రాక్షసుడు ఆత్మహత్య పై మంచు మనోజ్ హర్షం.. దేవుడు ఉన్నారంటూ..