
దివంగత నటుడు గుండు హనుమంతరావు గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలోని హీరోలలో తన అభిమాన నటుడు నాని అని స్పష్టం చేశారు. నాని చాలా అద్భుతంగా నటిస్తున్నారని, “మన ఇంట్లో కుర్రాడిలా” ఉంటారని హనుమంతరావు అభివర్ణించారు. నాని నటించిన చాలా సినిమాలను తాను చూశానని, అవన్నీ చాలా ఆసక్తికరంగా ఉన్నాయని, ప్రేక్షకులు చూడాలనిపించే విధంగా ఉన్నాయని ఆయన అన్నారు. నాని సినిమాల్లో పాటల విషయంలోనూ, ఒక నటుడిగా ఆయన పర్ఫార్మెన్స్ పరంగానూ చాలా బాగుంటున్నాయని హనుమంతరావు పేర్కొన్నారు. చిత్రాల ఎంపిక, హీరో-హీరోయిన్ల ఎంపిక వంటి అన్ని విషయాల్లోనూ నాని ప్రదర్శించే పద్ధతిని ఆయన కొనియాడారు.
భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమగాధ, ఎవడే సుబ్రహ్మణ్యం, నిన్నుకోరి వంటి చిత్రాలను ఉదాహరణలుగా చెబుతూ, నాని నటించిన ప్రతి సినిమా బాగుందని అన్నారు. థియేటర్‌కు వెళ్లినప్పుడు ప్రేక్షకుడు హాయిగా అనుభూతి చెందాలని, పాటల విషయంలోనో, మాటల విషయంలోనో కొత్త అనుభూతిని అందించాలని అభిప్రాయపడ్డారు. నాని పర్ఫార్మెన్స్ ప్రెజెంట్ చేయడంలో చాలా పద్ధతిగా, ఆలోచనాత్మకంగా వ్యవహరిస్తున్నారని గుండు హనుమంతరావు ప్రశంసించారు. ఎన్నో సినిమాలలో సున్నిత హాస్యాన్ని పంచి మనకి నవ్వుల్ని పంచిన గుండు హనుమంతురావు.. 2019, ఫిబ్రవరి 18న అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..