తమిళ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush).. న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన సినిమా మారి 2 . ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయినప్పటికీ ఇందులోని రౌడీ బేబీ సాంగ్ మాత్రం యూట్యూబ్‌ను షేక్ చేసింది. ఇప్పటికీ ఈ సాంగ్ మిలియన్స్ వ్యూస్ సాధిస్తూ దూసుకుపోతుంది. ధనుష్.. సాయి పల్లవి కెమిస్ట్రీ ప్రభుదేవా కొరియోగ్రఫీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఈపాటకు తమదైన స్టైల్లో కాలు కదిపారు. రోజులు గడుస్తు్న్నా ఈ సాంగ్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.. అయితే తాజాగా ఈ పాట యూట్యూబ్ నుంచి మాయమైపోయింది. మే 17న నెటిజన్స్ యూట్యూబ్‌లో సెర్చ్ చేయగా ఈ పాట ఎక్కడా కూడా కనిపించలేదు.. రౌడీ బేబీ సాంగ్ ఏమైందంటూ నెటిజన్స్ ట్వీట్స్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన మేకర్స్ పాటతో పాటు.. అసలు విషయాన్ని ఆడియన్స్‌కు ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు.
రౌడీ బేబీ సాంగ్ అప్లోడ్ చేసిన ధనుష్ సొంత నిర్మాణ సంస్థ వండర్‌బార్ ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానెల్ హ్యాక్ చేసినట్లు గుర్తించారు మేకర్స్. ఆ తర్వాత ఛానెల్ నుంచి రౌడీ బేబీ పాటను డెలిట్ చేశారట… తిరిగి యూట్యూబ్ ఛానెల్ పునరుద్ధరించిన తర్వాత మారి 2 నుంచి రౌడీ బేబీ పాటను అప్లోడ్ చేసినట్లు మేకర్స్ ట్వీట్ చేశారు.. మే 17న ఈ పాట యూట్యూబ్ నుంచి డెలిట్ చేయబడిందని.. ఆ తర్వాత మే 18 న ఈ పాటను తిరిగి అప్లోడ్ చేసినట్లు చెప్పారు.. ఈ పాటకు ఇప్పటివరకు 1.3 బిలియన్స్ పైగా వ్యూస్ సాధించింది. ధనుష్, సాయి పల్లవి నటించి ఈ పాటకు యువన్ శంకర్ రాజా కంపోజ్ చేశారు..
ట్వీట్..
Our YouTube channel is back! Thank you @YouTubeIndia for the support. @dhanushkraja @theSreyas @RIAZtheboss https://t.co/5PRzlflx2G
— Wunderbar Films (@wunderbarfilms) May 18, 2022