Actor : అమ్మోరు సినిమా వల్లే నా కెరీర్‏ని నాశనం.. సగం షూట్ అయ్యాక.. నటుడు సంచలన కామెంట్స్..

అమ్మోరు సినిమా.. తెలుగులో ఎవర్ గ్రీన్ హిట్ మూవీ. దివంగత హీరోయిన్ సౌందర్య నటించిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో విలన్ రామిరెడ్డి పాత్ర గురించి చెప్పక్కర్లేదు. అయితే ఈ సినిమా కారణంగా తన కెరీర్ నాశనం అయ్యిందని అంటున్నారు టాలీవుడ్ నటుడు. సగం షూట్ అయ్యాక తనను తీసేశారని అన్నారు. ఇంతకీ ఆ నటుడు ఎవరో తెలుసుకుందామా.

Actor : అమ్మోరు సినిమా వల్లే నా కెరీర్‏ని నాశనం.. సగం షూట్ అయ్యాక.. నటుడు సంచలన కామెంట్స్..
Ammoru Movie

Updated on: Jan 18, 2026 | 12:46 PM

టాలీవుడ్ నటుడు చిన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో చిత్రాల్లో కీలకపాత్రలు పోషించి మెప్పించారు. దశాబ్దాలుగా సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే తన కెరీర్ ను అమ్మోరు సినిమా నాశనం చేసిందని అన్నారు. అమ్మోరు చిత్రం కోసం నటుడు చిన్నా అంకితభావంతో పనిచేసినప్పటికీ, ఊహించని విధంగా ఆ పాత్ర నుండి తనను తొలగించారని అన్నారు. ఈ చేదు అనుభవం తనను ఎంతగానో నిరాశపరిచి, పరిశ్రమను వదిలి వెళ్లాలనే ఆలోచనకు దారితీసిందని ఆయన వెల్లడించారు. చిన్నా మాట్లాడుతూ..” దర్శకుడు కోడి రామకృష్ణ గారు తనను ఈ సినిమాలోని ఒక పాత్రకు ఎంపిక చేశారు. అప్పట్లో చిన్నా సామర్సారెడ్డి గారి ఆఫీసులో ఉండేవారు. కోడి రామకృష్ణ గారు ఒక ఇంగ్లీష్ సినిమాను చూపించి, పాత్ర తీరుతెన్నులను వివరించారు. ఆ పాత్రకు తగ్గ గెటప్‌ను స్వయంగా ధరించి చూపించడంతో దర్శకుడు బాగా ఆకట్టుకున్నారు. ఈ పాత్ర కోసం గుండు చేయించుకోవడానికి కూడా సిద్ధపడ్డాను, ఆ సమయంలో మనీ చిత్రంలో హీరోగా నటిస్తున్నా.. మనీ చిత్రాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు రాము గారు సహకరించారు, రెండు షెడ్యూల్స్ వేసి మరీ నన్ను అమ్మోరు షూటింగ్‌కు పంపించారు” అంటూ గుర్తుచేసుకున్నారు.

అమ్మోరు చిత్ర బృందం లండన్ నుండి వచ్చిన కెమెరామెన్ క్రిస్‌తో కలిసి క్లైమాక్స్‌ను దాదాపు నెలరోజులు చిత్రీకరించింది. కొండ మీద కాజా వేషంలో చిన్నా చాలా కష్టపడ్డారు. ఒకానొక సందర్భంలో గ్రాఫిక్స్ షాట్ కోసం పద్మాలయ స్టూడియోలో 72 గంటలు నిద్రలేకుండా పనిచేశారు. చిత్రం డబ్బింగ్ దశకు చేరుకున్నప్పుడు, తన క్యారెక్టర్‌కు సాయికుమార్ తో డబ్బింగ్ చెప్పిద్దామని దర్శకుడు కోడి రామకృష్ణ సూచించారు. ఫైనల్ అవుట్‌పుట్ చూసిన తర్వాత, దర్శకుడు కోడి రామకృష్ణ తాను ఆశించిన విజన్ రాలేదని తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ సినిమాను ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియక, అప్పట్లో కోడి రామకృష్ణతో విభేదాలు ఉన్న కోడ రామేష్ గారిని సంప్రదించారు. కోడ రామేష్, చిన్నాను విలన్‌గా చూడటం తనకు నచ్చలేదని.. చిన్నా పెద్ద కామెడీ స్టార్, విలన్ ఏంటి? అని ప్రశ్నించారు. చిన్నా స్థానంలో రామిరెడ్డిని తీసుకుంటే బాగుంటుందని సూచించారు. దాదాపు ఒకటిన్నర సంవత్సరాలు అమ్మోరు కోసం కష్టపడిన తనను ఆ పాత్ర నుండి తొలగించారని.. ఈ నిర్ణయం తనను తీవ్రంగా కలచివేసిందని.. ఇండస్ట్రీని వదిలి శాశ్వతంగా ఊరికి వెళ్లిపోవాలని కూడా అనుకున్నానని అన్నారు. అప్పటికే పెళ్లి జరిగి రెండు రోజులు కావడం, చెన్నైలో కొత్తగా కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవడం వంటి కారణాలతో మరింత వేదనకు గురయ్యారు. ఆ బాధ పోవడానికి నాలుగైదు సంవత్సరాలు పట్టిందని చిన్నా వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Prabhas: ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది.. ఆరోజు రాత్రి.. డార్లింగ్ బెస్ట్ ఫ్రెండ్ కామెంట్స్..

Chinna

ఎక్కువ మంది చదివినవి : Child Artist: షూటింగ్‏లో యాక్సిడెంట్.. 2 ఏళ్లు నరకం అనుభవించా.. సూర్యవంశం చైల్డ్ ఆర్టిస్ట్..