
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం పెళ్లిళ్ల సందడి నెలకొంది. సినిమా తారలు ఒక్కొక్కరూ వరుసగా పెళ్లిపీటలెక్కనున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల వివాహం గ్రాండ్ గా జరిగింది. ఇవాళ (మార్చి 06) అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీశ్- నయనికల పెళ్లి వేడుక జరగనుంది. ఇప్పుడు మరో యంగ్ హీరో పెళ్లికి రెడీ అవుతున్నాడు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ కొడుకు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా తన బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెప్పనున్నాడని సమాచారం. తను ప్రేమించిన అమ్మాయితో త్వరలోనే కొత్త జీవితం ప్రారంభించనున్నాడని టాక్. బెల్లం కొండ శ్రీనివాస్ గత కొన్నేళ్లుగా కావ్యా రెడ్డి అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇరు పెద్దలు కూడా వీరి ప్రేమను ఆశీర్వదించడంతో ఆదివారం (మార్చి 8) న వీరి నిశ్చితార్థం జరగనున్నట్లు సమాచారం. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో శ్రీనివాస్- కావ్య లు ఉంగరాలు మార్చుకోనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే శ్రీనివాస్ పెళ్లిపై ఒక అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.
బెల్లంకొండ శ్రీనివాస్ కు కాబోయే భార్య కావ్యా రెడ్డిది కూడా హైదరాబాదేనట. అయితే సినిమా ఇండస్ట్రీలో ఆమెకు ఎలాంటి సంబంధాలు లేవట. కావ్య తండ్రి ఓ ప్రముఖ లాయర్ అని సమాచారం. శ్రీనివాస్- కావ్యల పరిచయం ఎలా మొదలైంది? ఎప్పుడు ప్రేమలో పడ్డారు? అన్న విషయాలు తెలియలేదు కానీ.. ఇరు పెద్దలు వీరి ప్రేమకు పచ్చజెండా ఉపారని సమచారం. ఈ ఏడాది చివరిలో వీరి పెళ్లి జరగనుందని తెలుస్తోంది. ఎంగేజ్మెంట్ తర్వాత శ్రీనివాస్ పెళ్లిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.
‘అల్లుడు శీను’ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఆ తర్వాత స్పీడున్నోడు, జయ జానకీ నాయక, సాక్ష్యం, కవచం, సీత, రాక్షసుడు, అల్లుడు అదుర్స్, ఛత్రపతి (హిందీ రీమేక్), భైరవం, కిష్కింధ పురి తదితర సినిమలతో మంచి సక్సెస్ లు అందుకున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. టైసన్ నాయుడు, హైందవతో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తున్నాడు బెల్లంకొండ.
#BellamkondaSreenivas engagement is set to take place THIS WEEK. Wedding is expected to happen soon.❤️💍 pic.twitter.com/Ot2cRphPYp
— Media Mic | Indian Cinema | Tollywood (@MMTollywood) March 5, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.