Akash Puri: దగ్గరగా చూస్తే వాళ్ల జీవితాలు వేరుగా ఉంటాయి.. నన్ను కొత్తగా చూపిస్తుంది.. హీరో ఆకాష్ పూరి కామెంట్స్ వైరల్..

|

Jun 23, 2022 | 9:29 AM

నాకు ఈ సినిమా కథను ఐదు గంటల పాటు చెప్పారు దర్శకుడు జీవన్ రెడ్డి. ఇందులో బచ్చన్ సాబ్ అనే హీరో క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. చోర్ బజార్ ఏరియా అంటే మనం అక్కడి వాళ్లు దొంగతనాలు చేస్తారు అనుకుంటాం.

Akash Puri: దగ్గరగా చూస్తే వాళ్ల జీవితాలు వేరుగా ఉంటాయి.. నన్ను కొత్తగా చూపిస్తుంది.. హీరో ఆకాష్ పూరి కామెంట్స్ వైరల్..
Akash Puri
Follow us on

ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో దూసుకుపోతున్న యంగ్ హీరోలలో ఆకాష్ పూరి (Akash Puri) ఒకరు. మాస్ డైరెక్టర్ పూరి తనయుడిగా సినీ అరంగేట్రం చేసిన ఈ యంగ్ హీరో మెహబూబా, రొమాంటిక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు.. ప్రస్తుతం ఆకాష్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ జీవన్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న సినిమా చోర్ బజార్ (Chor Bazaar). యూవీ క్రియేషన్స్ సమర్పణలో వీఎస్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో గెహనా సిప్పీ కథానాయికగా నటిస్తోంది. మాస్, కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. చోర్ బజార్ ప్రమోషన్లలో భాగంగా మీడియాతో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు హీరో అకాష్ పూరి.

ఈ సందర్భంగా ఆకాష్ పూరి మాట్లాడుతూ.. ” నాకు ఈ సినిమా కథను ఐదు గంటల పాటు చెప్పారు దర్శకుడు జీవన్ రెడ్డి. ఇందులో బచ్చన్ సాబ్ అనే హీరో క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. చోర్ బజార్ ఏరియా అంటే మనం అక్కడి వాళ్లు దొంగతనాలు చేస్తారు అనుకుంటాం. కానీ దగ్గరగా చూస్తే వాళ్ల జీవితాలు వేరుగా ఉంటాయి. అక్కడి మనుషులు, కుటుంబాలు, వాళ్ల కష్టాలు అవన్నీ ఈ సినిమాలో చూస్తారు. హీరో టైర్లు విప్పిసే అమ్మే దొంగ. మీరు కార్ పార్క్ చేస్తే నిమిషాల్లో టైర్లు మాయం చేస్తాడు. ఇందులో రికార్డులు కూడా సాధించేస్తుంటాడు. అయితే ఆ డబ్బుతో అక్కడి పేదవారికి సాయం చేస్తుంటాడు. వాళ్లకు మాత్రం హీరో మంచి వాడు.

నేను ఇప్పటిదాకా చేసిన చిత్రాల్లో ఇది భిన్నమైన సినిమా. పూర్తి కమర్షియల్ అంశాలతో హీరోయిజం ఎలివేట్ చేస్తూ సాగుతుంది. దర్శకుడు జీవన్ రెడ్డి గత చిత్రాల్లోనూ హీరోయిజం బాగా చూపించారు. అలాగే ఈ సినిమాలోనూ ఉంటుంది. నాకు కొత్త ఇమేజ్ క్రియేట్ అవుతుందని ఆశిస్తున్నాను. సీనియర్ నటి అర్చనతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఆమె మా సినిమాలో నటించేందుకు ఒప్పుకోవడమే అదృష్టం అనుకుంటాం. నా పేరు బచ్చన్ సాబ్ అని ఆమె పెడతారు. నాకు బచ్చన్ సాబ్ అనే పేరు పెట్టడం నాన్న పూరీకి బాగా నచ్చింది. దిల్ దార్ గా బతుకే వ్యక్తి అతను. ఇది కంప్లీట్ గా ఫిక్షన్ క్యారెక్టర్. నా గత సినిమాలు చూసిన వాళ్లు నా వయసుకు మించిన పాత్రలు చేశానని అన్నారు. ఇక నుంచి అందరికీ నచ్చే సినిమాలే ఎంచుకోవాలని అనుకుంటున్నాను. రెండు మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటి వివరాలు త్వరలో వెల్లడిస్తా.” అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.