Acharya Movie : చిరంజీవి సినిమాలో ‘సిద్ధా’గా చరణ్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. ఈ సినిమాలో చిరంజీవి రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు.

Acharya Movie : చిరంజీవి సినిమాలో సిద్ధాగా చరణ్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్

Updated on: Jan 17, 2021 | 11:17 AM

Acharya Movie:  మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘ఆచార్య’. ఈ సినిమాలో చిరంజీవి రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. ఇక ‘ఆచార్య’ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటించనున్నాడు. ప్రస్తుతం రాజమౌళితెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ లో నటిస్తున్న చరణ్ ఇటీవలే ఆచార్య షూటింగ్ లో జాయిన్ అయ్యారు. తాజాగా చరణ్ కు సంబంచిన పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

ఈ పోస్టర్ లో రామ్ చరణ్‌ మెడలో రుద్రాక్ష.. చెవికి పోగుతో కనిపించారు. ఈ సినిమాలో చరణ్‌ సిద్ధా అనే పాత్రలో కనిపించనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది.  ‘సిద్ధాకు ‘ఆచార్య’ సెట్‌లోకి స్వాగతం పలుకుతున్నాం’ అంటూ కొణెదల ప్రొడక్షన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడిందించింది. ఆచార్య లో హీరోయిన్ గా చందమామ కాజల్ నటిస్తుంది. మెగాస్టార్ – మెగా పవర్ స్టార్ ను కలిసి వెండితెరపైన చూడాలని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాను కొణెదల ప్రొడక్షన్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆచార్య సినిమాను సమ్మర్ కు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Natkhat Movie: ఆస్కార్ అవార్డు రేసులో విద్యాబాలన్ సినిమా.. 2021 బెస్ట్ షార్ట్ ఫిల్మ్ క్యాటగిరిలో ‘నట్‏ఖట్’..

బీజాపూర్ అటవీ ప్రాంతంలో కొనసాగుతోన్న సెర్చ్ ఆపరేషన్, సైబో కాల్చివేత తర్వాత గాలింపు మరింత తీవ్రతరం

 

Loading...
Unable to load recommendations.
Follow Us