Natkhat Movie: ఆస్కార్ అవార్డు రేసులో విద్యాబాలన్ సినిమా.. 2021 బెస్ట్ షార్ట్ ఫిల్మ్ క్యాటగిరిలో ‘నట్‏ఖట్’..

2021 బెస్ట్ షార్ట్ ఫిల్మ్ క్యాటగిరి ఆస్కార్ రేసు బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ నిర్మించిన షార్ట్ ఫిల్మ్ 'నట్‏ఖట్' నిలించింది.

Natkhat Movie: ఆస్కార్ అవార్డు రేసులో విద్యాబాలన్ సినిమా.. 2021 బెస్ట్ షార్ట్ ఫిల్మ్ క్యాటగిరిలో 'నట్‏ఖట్'..
Follow us

|

Updated on: Jan 17, 2021 | 11:07 AM

Vidyabalan Natkhat Movie:  2021 బెస్ట్ షార్ట్ ఫిల్మ్ క్యాటగిరి ఆస్కార్ రేసు బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ నిర్మించిన షార్ట్ ఫిల్మ్ ‘నట్‏ఖట్’ నిలించింది. ఇందులో విద్యాబాలన్ తల్లి పాత్రలో నటించగా.. లింగ సమానత్వం, మహిళల పట్ల ద్వేషం తీరుతెన్నులను తన కొడుకును ఓ తల్లి బోధిస్తున్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాతో విద్యాబాలన్ నిర్మాణ రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇక 2020 బెస్ట్ ఆప్ ఇండియా షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ మూడో ఎడిషన్లో ‘నట్‏ఖట్’ ఉత్తమ షార్ట్ ఫిల్మ్ అవార్డు అందుకుంది.

ఆస్కార్ రేసులో ‘నట్‏ఖట్’ నిలవడం గర్వంగా ఉందని సినీ నిర్మాణ సంస్థ ఆర్ఎస్వీపీ మూవీస్ ట్వీట్ చేసింది. మేం రూపొందించిన ‘నట్‏ఖట్’ షార్ట్ ఫిల్మ్ ఇంటి నుంచే మార్పు ప్రారంభం అవుతుందని ఇచ్చిన సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా నలుమూలలకు వెళ్ళింది. షార్ట్ ఫిల్మ్ క్యాటగిరిలో ఆస్కార్-2021 అవార్డు కోసం మా సినిమా పోటీలో ఉండడం గర్వంగా ఉందని ట్వీట్ చేసింది. ఇది ఒక గుర్తింపు, ఒక ధ్రువీకరణ. మనం చేసిన పనికి లభించే ప్రశంస ఎంతో విలువైనది. ఎల్లప్పుడు నేను చేసిన పనికి ఇది లిట్మస్ టెస్ట్ వంటిది. జాతీయంగా గానీ, అంతర్జాతీయంగా కానీ గుర్తింపు లభించడం చాలా ముఖ్యమైంది. ఒక కళాకారిణికి మరింత విలువైందని విద్యాబాలన్ తెలిపారు. అటు ‘నట్‏ఖట్’ సినిమాతోపాటు షేమ్ లెస్, షేవింగ్ చింటూ సినిమాలు కూడా ఈ క్యాటగిరిలో పోటీ పడుతున్నాయి.

Also Read: ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. హీరోయిన్‌ రేసులో ఆ ఇద్దరు..!

పెద్ద స్టార్‌తో క్రైమ్‌ డ్రామా.. ఈసారి మిమ్మల్ని నిరుత్సాహపరచనన్న తరుణ్ భాస్కర్‌