AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kushboo: ఖుష్బూ కూతురి పెళ్లిలో త్రిషతో కలిసి ఆ స్టార్ హీరో భార్య సందడి.. అందరి చూపు ఆమె పైనే..

సీనియర్ హీరోయిన్ ఖుష్బూ సుందర్ కూతురు అవంతిక వివాహం గోవాలో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

Kushboo: ఖుష్బూ కూతురి పెళ్లిలో త్రిషతో కలిసి ఆ స్టార్ హీరో భార్య సందడి.. అందరి చూపు ఆమె పైనే..
Aarti Ravi
Rajitha Chanti
|

Updated on: Jun 28, 2026 | 10:26 AM

Share

సీనియర్ ఖుష్బూ, దర్శకుడు సుందర్ సి దంపతుల కుమార్తె అవంతిక వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. చెన్నైకు చెందిన వ్యాపారవేత్త శ్రవణ్ శ్రీనివాస్ తో ఖుష్బూ కూతురి పెళ్లి జూన్ 25న గోవాలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సెలబ్రెటీలు సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవి సురేఖ, నాగార్జున అమల, వెంకటేష్ నీరజ దంపతులు స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. సుందర్ ప్రముఖ దర్శకుడే కాకుండా నటుడు కూడా. ఇక ఆయన భార్య ఖుష్బూ చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అయితే ఈ పెళ్లి వేడుకలలో హీరోయిన్ త్రిష, తమన్నా స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ షేర్ చేస్తూ బ్యూటీఫుల్ మెమొరీస్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది తమన్నా.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఖుష్బూ కూతురి పెళ్లిలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సందడి.. స్పెషల్ అట్రాక్షన్‏గా త్రిష.. వీడియోస్ ఇదిగో..

అయితే వీరితోపాటు ఓ స్టార్ హీరో భార్య సైతం పెళ్లి వేడుకలో మరో అట్రాక్షన్ అయ్యారు. అందరి చూపు ఆమె వైపే ఉంది. ఆమె మరెవరో కాదండి.. కోలీవుడ్ హీరో జయం రవి భార్య ఆర్తి. కొన్నాళ్లుగా ఆమె పేరు ఫిల్మ్ వర్గాల్లో మారుమోగుతున్న సంగతి తెలిసిందే. ఆమె చెన్నైలోని సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆర్తీ, జయం రవిలది ప్రేమ వివాహం. వీరు 2009 జూన్‌లో వివాహం చేసుకున్నారు. వీరికి ఆరవ్, అయాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలాది మంది ఫాలోవర్లను కలిగి ఉన్న ప్రముఖ ఫ్యాషన్ , లైఫ్‌స్టైల్ ఇన్‌ఫ్లుయెన్సర్.

ఎక్కువమంది చదివినవి : RRR Movie : అబ్బబ్బా.. ఏం మారింది భయ్యా.. ఆర్ఆర్ఆర్ సినిమా మల్లీని చూశారా.. ? అచ్చం హీరోయిన్‏లాగే ఉందిగా..

కొన్ని రోజులుగా ఆర్తి, రవి విడాకుల కేసు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు తీవ్ర స్తాయిలో విమర్శలు చేసుకున్నారు. కొన్నాళ్లుగా రవి మరో సింగర్ కెనీషాతో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం వీరిద్దరి విడాకుల కేసు కోర్టులో ఉంది. ఈ క్రమంలో తాజాగా ఖుష్బూ కూతురి పెళ్లిలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు ఆర్తి.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఉదయ్ కిరణ్‏తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్.. ఎంతో నరకం అనుభవించాను.. టాలీవుడ్ హీరోయిన్..

తమన్నా పోస్ట్..

ఎక్కువమంది చదివినవి : Cinema: 5 ఏళ్లుగా తగ్గని డిమాండ్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ మూవీ.. ఓటీటీలో గత్తరలేపుతుంది..

Follow Us