ఎన్టీఆర్‌తో రెండు సినిమాలు.. కెరీర్ పీక్‌లో ఉండగానే ఆత్మహత్యకు ప్రయత్నించింది.. ఇప్పుడు ఇలా

కొంతమంది హీరోయిన్స్ తమ నటనతో అందంతో మెప్పిస్తూ సక్సెస్ అవుతున్నారు. వారిలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ ఒకరు. ఒకప్పుడు ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్. చేసింది కొన్ని సినిమాలే కానీ కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది ఆ అందాల తార.

ఎన్టీఆర్‌తో రెండు సినిమాలు.. కెరీర్ పీక్‌లో ఉండగానే ఆత్మహత్యకు ప్రయత్నించింది.. ఇప్పుడు ఇలా
Actress

Updated on: Sep 30, 2026 | 12:57 PM

టాలీవుడ్‌లో కొంతమంది హీరోయిన్లు పదుల సంఖ్యలో సినిమాలు చేయకపోయినా.. ప్రేక్షకుల మనసుల్లో మాత్రం చెరగని ముద్ర వేసుకుంటారు. అలాంటి కథానాయికల్లో ఈ ముద్దుగుమ్మ ఒకరు. కెరీర్ మొదలైన కొద్దికాలానికే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించి బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. తన అందంతో నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. కానీ ఆమె కొంతకాలానికే వెండితెరకు దూరమయ్యింది. ఇప్పుడు అసలు ఎక్కడా కనిపించడం లేదు ఈ హీరోయిన్. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? అందం, అభినయంతో కుర్రాళ్ళ గుండెల్లో ప్రింట్ అయిపోయిన గజాల. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎంటర్ నటించిన స్టూడెంట్ నంబర్ వన్ సినిమాతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది గజాల. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చినా.. కొంతకాలానికే వెండితెరకు  దూరం అయ్యింది. అసలు గజాల సినిమాలు ఎందుకు మానేసింది,? ప్రస్తుతం ఆమె ఏం చేస్తున్నారు.? అనేది ఒక్కసారి చూద్దాం.!

అలాంటి హీరోయిన్‌ మరొకరు ఉండరు.. అందం, గుణం కలబోసిన నటి.. ఆమె కోసమే ఆ సినిమాను 60, 70సార్లు చూశా

గజాల 2001లో నాలో ఉన్న ప్రేమ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన స్టూడెంట్ నంబర్ వన్ లో ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం దక్కింది. ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకోవడంతో గజాలకు కూడా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ‘కలుసుకోవాలని’, ‘తొట్టి గ్యాంగ్’, ‘అల్లరి రాముడు’ తదితర చిత్రాల్లో నటించింది. అయితే హీరోయిన్‌గా వరుస అవకాశాలు వస్తున్న సమయంలోనే గజాల కెరీర్‌లో అనుకోని మలుపులు వచ్చాయి. వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న కొన్ని సంఘటనలు కూడా ఆమెపై ప్రభావం చూపినట్లు అప్పటి వార్తా కథనాలు పేర్కొన్నాయి. 2002లో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే దానికి అసలు కారణం ఏమిటన్న దానిపై అప్పట్లో పలు ఊహాగానాలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

విరాట్ కోహ్లీ నా బావ.. షాకింగ్ విషయం చెప్పిన టాలీవుడ్ హీరోయిన్.. షాక్‌లో అభిమానులు

ఆ తర్వాత గజాల మళ్లీ సినిమాల్లో నటించారు. అయితే గతంలో ఉన్నంత వేగంగా అవకాశాలు రాలేదు. హీరోయిన్‌గా ఆమె చివరి తెలుగు సినిమాల్లో ‘జానకి వెడ్స్ శ్రీరామ్ ఒకటి కాగా, వెంకటేష్ నటించిన మల్లీశ్వరిలో అతిథి పాత్రలోనూ కనిపించారు. ఆ తర్వాత మాత్రం సినిమాల నుంచి క్రమంగా దూరమయ్యారు. 2016లో హిందీ టెలివిజన్ నటుడు ఫైజల్ రజా ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఆమె సినిమాల కంటే కుటుంబ జీవితానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆమె తండ్రి వ్యాపారంలో ఇంటీరియర్ డిజైనర్‌గా కూడా పనిచేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం గజాల సినిమాల్లో యాక్టివ్‌గా లేకపోయినా.. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కనిపిస్తుంటారు. ఆమె ఫొటోలు బయటకు వచ్చిన ప్రతిసారీ ఈ  ‘స్టూడెంట్ నంబర్ వన్’ హీరోయిన్‌ను గుర్తు చేసుకుంటూ అభిమానులు స్పందిస్తున్నారు. సినిమాల్లో కనిపించిన గజాలకూ.. ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్న గజాలకూ చాలా మార్పు కనిపిస్తుండటంతో ఆమె ఫొటోలు తెగ షేర్ చేస్తున్నారు.

నువ్వేమైన పెద్ద హీరోయిన్‌వా.., అందగత్తెవా అంటూ అవమానించారు.. కట్ చేస్తే 150కుపైగా సినిమాలు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us