sandeep reddy vanga : పాన్ ఇండియా స్టార్ అయ్యే ఛాన్స్ ను ఈ స్టార్ హీరోలు మిస్ చేసుకున్నారా..?

|

Jan 06, 2021 | 1:58 PM

అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు దర్శకుడు సందీప్ వంగ. ఈ యంగ్ డైరెక్టర్ ఇదే సినిమాను బాలీవుడ్ కు తీసుకువెళ్లి అక్కడ సాలిడ్ హిట్ ను అందుకున్నాడు.

sandeep reddy vanga : పాన్ ఇండియా స్టార్ అయ్యే ఛాన్స్ ను ఈ స్టార్ హీరోలు మిస్ చేసుకున్నారా..?
Follow us on

sandeep reddy vanga : ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు దర్శకుడు సందీప్ వంగ. ఈ యంగ్ డైరెక్టర్ ఇదే సినిమాను బాలీవుడ్ కు తీసుకువెళ్లి అక్కడ సాలిడ్ హిట్ ను అందుకున్నాడు. ప్ర‌స్తుతం ఎనిమ‌ల్ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ డైరెక్ట‌ర్ న్యూఇయ‌ర్ సంద‌ర్భంగా ఎనిమ‌ల్ చిత్రాన్ని ప్ర‌క‌టిస్తూ విడుద‌ల చేసిన వీడియో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ర‌ణ్ బీర్ క‌పూర్ టైటిల్ రోల్ చేస్తున్నాడు. గుల్ష‌న్ కుమార్‌-టీ సిరీస్ స‌మ‌ర్పిస్తున్న ఈ చిత్రంలో అనిల్ క‌పూర్, బాబీడియోల్‌, ప‌రిణీతి చోప్రా ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

అయితే కబీర్ సింగ్ సినిమా ర్వాత తెలుగు హీరోలతో సినిమా చేయాలనీ సందీప్ ప్రయత్నించాడు. కానీ సందీప్ కథను ఏ హీరో కూడా యాక్సప్ట్ చేయలేదు.  మ‌హేశ్‌, ప్రభాస్ తో పాటు మరికొందరు సందీప్ చెప్పిన క‌థ‌పై ఆసక్తి చూపన‌ట్టు కానీ ఎందుకో సినిమాను పట్టాలెక్కించడానికి మాత్రం అలోచించి ఆగిపోయినట్టు  ఫిలిం నగర్లో గుసగుసలు వినిపించాయి.  అయితే ఎనిమల్ సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నాడట సందీప్. అయితే ఈ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారే అవ‌కాశాన్ని ప్రభాస్ ను మినహాయించి తెలుగు స్టార్లు కోల్పోయార‌ని కొందరు విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.