AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఏ అవసరం వచ్చినా అండగా ఉంటాను.. బ్లైండ్ ఫౌండేషన్‌ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న టాలీవుడ్ హీరో..

టాలీవుడ్ హీరో సంజోష్ మంచి మనసు చాటుకున్నారు. రాఖీ పండగ సందర్భంగా శ్రీమాత బ్లైండ్ ఫౌండేషన్ కు చెందిన అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఉపయోగపడే గ్యాస్ స్టవ్ బహుకరించి అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. ఇకపై వారందూర తన చెల్లెళ్లని.. వారికి ఏ అవసరం వచ్చినా అన్నయ్యగా తన వంతు సహకారం అందిస్తా్నని అన్నారు.

Tollywood: ఏ అవసరం వచ్చినా అండగా ఉంటాను.. బ్లైండ్ ఫౌండేషన్‌ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న టాలీవుడ్ హీరో..
Actor Sanjosh
Rajitha Chanti
|

Updated on: Aug 28, 2026 | 12:34 PM

Share

టాలీవుడ్ హీరో సంజోష్ గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. లెజండ్రీ యాక్టర్ రాజేంద్రప్రసాద్ నటించిన బేవర్స్ సినిమాలో హీరోగా నటించారు సంజోష్. నటనతో మంచి మార్కులు కొట్టేసిన సంజోష్.. ఇప్పుడు మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. రీల్ లోనే కాకుండా రియల్ లైఫ్ లోనూ హీరో అనిపించుకున్నారు. శుక్రవారం రాఖీ పండగ సందర్భంగా హైదరాబాద్ నాగోల్ లోని శ్రీమాత బ్లైండ్ ఫౌండేషన్ కు చెందిన అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఉపయోగపడే గ్యాస్ స్టవ్ బహుకరించారు. అలాగే అందరికి భోజనాలు ఏర్పాటు చేశారు. సంజోష్ మాట్లాడుతూ “ఇకపై మీరందరూ నా చెల్లెళ్లే. మీకు ఏ అవసరం వచ్చినా నా వంతు అండగా ఉంటాను” అంటూ వారికి మాట ఇచ్చారు. ఇప్పటికే శ్రీమాత బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిల కోసం రెండు సార్లు భోజనాలు ఏర్పాటు చేయడంతో పాటు, ఫ్రిజ్ డొనేషన్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : 3 సీజన్స్.. 33 ఎపిసోడ్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీని శాసిస్తున్న సిరీస్.. ఇప్పటికీ తెగ డిమాండ్..

ఇది మాత్రమే కాదు. ఇప్పటివరకు 250 మందికి మొబైల్ ఐ క్యాంప్స్ ద్వారా క్యాటరాక్ట్ సర్జరీలు, 118 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందించారు. అలాగే 3 మంది విద్యార్థుల చదువు బాధ్యతను స్వయంగా తీసుకున్నారు. వరంగల్ నుంచి వచ్చి సినీ పరిశ్రమలో మంచి ఫ్యామిలీ కథలతో ప్రేక్షకులను అలరిస్తూనే.. తన వంతుగా సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఆలోచనతో సేవా కార్యక్రమాలు చేస్తున్న హీరో సంజోష్‌ను అభినందించాల్సిందే.

ఎక్కువ మంది చదివినవి :  Bigg Boss : నన్ను వాడుకుని వదిలేశాడు.. టార్చర్ చేశాడు.. అందుకే చచ్చిపోవాలనుకున్నా.. బిగ్ బాస్ బ్యూటీ..

ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టిన సంజోష్.. ఒక్కో మెట్టు ఎక్కుతూ నటుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. అలాగే ఇటు నిజ జీవితంలో తన వంతుగా సేవ కార్యక్రమాలు చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు సంజోష్.

ఎక్కువ మంది చదివినవి : Jabardasth : రామోజీ ఫిల్మ్ సిటీలో హోటల్ ఇండస్ట్రీలో నాతో పనిచేశాడు.. ఇప్పుడు క్రేజీ హీరో.. జబర్దస్త్ నటుడు..

ఎక్కువ మంది చదివినవి : Tollywood: అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో పెద్ద నటుడు.. గవర్నమెంట్ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి ఎందుకు వచ్చారంటే..

Follow Us