ఈ మధ్యకాలంలో ఓటీటీల ప్రభావం ఎక్కువైంది. థియేటర్లలో తమకు నచ్చిన సినిమాలు మిస్సయిన ప్రేక్షకులు ఓటీటీలలోకి ఎప్పుడెప్పుడు వస్తాయోనని ఎదురు చూస్తుంటారు. అలాగే ప్రముఖ ఓటీటీ సంస్థలు కూడా సినీ ప్రియుల కోసం ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. ఈ వారం దాదాపుగా 10కి పైగా చిత్రాలు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. వాటితో పాటు సరికొత్త వెబ్ సిరీస్‌లు కూడా లిస్టులో ఉన్నాయి. మరి అవేంటో చూసేద్దాం..
క్రిస్మస్ వచ్చేస్తోంది. ఈ తరుణంలో నెట్‌ఫ్లిక్స్ సినీప్రియుల కోసం వరుసపెట్టి కొత్త చిత్రాలను, వెబ్ సిరీస్‌లను లైన్‌లో పెట్టింది. అందులో ఈ వారం ‘బీస్ట్ ఆఫ్ బెంగుళూరు: ఇండియన్ ప్రిడేటర్’, ‘ది రిక్రూట్’, ‘దోచేయ్’, ‘కొండపోలం’, ‘ఈగ’ ‘గ్లిట్టర్’, ‘డోంట్ పికప్ ది ఫోన్’, ‘హూ కిల్లెడ్ శాంటా?’, ‘ఎ స్టార్మ్ ఫర్ క్రిస్మస్’, ‘అరియిప్పు’, ‘ఫార్ ఫ్రమ్ హోమ్’, ‘ఓ పిట్ట కథ’, ‘ప్రైవేట్ లెసన్’, ‘బార్డో: ఫాల్స్ క్రానికల్ ఆఫ్ ఎ హ్యాండ్‌ఫుల్ ఆఫ్ ట్రూత్స్’ లాంటివి స్ట్రీమింగ్ కానున్నాయి.
విక్కీ కౌశల్, భూమి పెడ్నేకర్, కియారా అద్వానీల ‘గోవింద నామ్ మేరా’ సినిమా డైరెక్ట్ స్ట్రీమింగ్ ఈ వారం డిస్నీ+ హాట్ స్టార్‌లో కానుంది. శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నిర్మాత కరణ్ జోహార్ నిర్మించారు. అలాగే, రియాలిటీ షో ‘మూవింగ్ ఇన్ విత్ మలైకా’ నాలుగు కొత్త ఎపిసోడ్‌లు కూడా ప్రసారం కానున్నాయి.
బెంగాలీ చిత్రం ‘అనంత’ ఈ వారం Zee5లో ప్రసారం కానుంది. ఈ చిత్రానికి రిత్విక్ చక్రవర్తి దర్శకత్వం వహించారు.
‘దిల్ దియాన్ గల్లన్’ – ఏ ఫ్యామిలీ డ్రామా డిసెంబర్ 12న ప్రసారం అవుతుంది. ఇందులో కావేరీ ప్రియం, పరాస్ అరోరా ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు.
‘కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్’ రెండు ఎపిసోడ్‌లు ఇప్పటికే ముగియగా, మూడవది, ఈ వారం విడుదల కాబోతోంది.
1. రిక్రూట్
2. బీస్ట్ ఆఫ్ బెంగుళూరు : ఇండియన్ ప్రిడేటర్
3. దోచేయ్
4. గ్లిట్టర్
5. డోంట్ పిక్ అప్ ది ఫోన్
6. హూ కిల్లిడ్ ది శాంటా? మర్డర్ మిస్టరీ
7. ఫార్ ఫ్రమ్ హోమ్
8. పిట్టకథ
9. ప్రైవేట్ లెసెన్
10. ఏ స్ట్రోమ్ ఫర్ క్రిస్మస్
11. బార్డో
12. కొండపొలం
1. గోవింద నామ్ మేరా
2. మూవింగ్ విత్ మలైకా
1. అనంత
1. దిల్ దియాన్ గల్లన్
1. కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్