Horror Movies OTT: ఈ సినిమాలను ఒంటరిగా మాత్రం చూడొద్దు.. అనుక్షణం వణుకుపుట్టించే చిత్రాలు.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే..

|

Aug 19, 2024 | 9:14 AM

అలాంటి వారి కోసమే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో అనేక ది బెస్ట్ హారర్ మూవీస్ ఉన్నాయి. కానీ ఈ చిత్రాలను ఒంటరిగా చూడాలంటే మాత్రం ఎంతో ధైర్యం కావాలి. మరీ ఆ సినిమాలేంటో తెలుసుకుందామా. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని భాషలలోనూ ప్రేక్షకులను భయపెట్టే ది బెస్ట్ హారర్ మూవీస్ అవేంటో చూసేద్దాం.

Horror Movies OTT: ఈ సినిమాలను ఒంటరిగా మాత్రం చూడొద్దు.. అనుక్షణం వణుకుపుట్టించే చిత్రాలు.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే..
Horror Movies
Follow us on

హారర్ సినిమాలు చూడడం చాలా మందికి ఇష్టం. అనుక్షణం వెన్నులో భయం కలిగించే సీన్స్.. అసలు ఊహించని ట్విస్టులతో వణుపుట్టించే హారర్ కంటెంట్ చిత్రాలను చూస్తే వచ్చే మజానే వేరు. ఓవైపు భయం కలుగుతున్న హారర్ చిత్రాలను చూసేందుకు జనాలు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక ఇప్పుడు ఓటీటీల్లో హారర్ సినిమాలను చూసే అడియన్స్ సంఖ్య మరింత పెరిగింది. అలాంటి వారి కోసమే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో అనేక ది బెస్ట్ హారర్ మూవీస్ ఉన్నాయి. కానీ ఈ చిత్రాలను ఒంటరిగా చూడాలంటే మాత్రం ఎంతో ధైర్యం కావాలి. మరీ ఆ సినిమాలేంటో తెలుసుకుందామా. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని భాషలలోనూ ప్రేక్షకులను భయపెట్టే ది బెస్ట్ హారర్ మూవీస్ అవేంటో చూసేద్దాం.

బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ నటించిన హారర్ మూవీ భూత్ పార్ట్ 1. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే బీటౌన్ స్టార్స్ నవాజుద్దీన్ సిద్ధఖీ, రాధికే ఆప్డే కలిసి నటించిన హారర్ మూవీ రాత్ అకేలీ హై. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. యానిమల్ బ్యూటీ త్రిప్తి ప్రధాన పాత్రలో నటించిన హారర్ సినిమా బుల్ బుల్. ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో చూడొచ్చు.

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అవికా గోర్ ప్రధాన పాత్రలో నటించిన హారర్ సినిమా 1920: హారర్స్ ఆఫ్ ది హార్ట్. ఈ సినిమా హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అనుష్క శర్మ నటించిన హారర్ మిస్టరీ సినిమా పరి. తనదైన నటనతో ప్రేక్షకులను భయపెట్టింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. అజయ్ దేవగణ్, జ్యోతిక, ఆర్ మాధవన్ కలిసి నటించిన సినిమా సైతాన్. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.