The Kerala Story: సుప్రీంకోర్టును ఆశ్రయించిన ‘ది కేరళ స్టోరీ’ దర్శకుడు.. పశ్చిమ బెంగాల్‌లో సినిమాపై నిషేధం తొలిగించాలంటూ..

'ది కేరళ స్టోరీ' నిర్మాతలు పశ్చిమ బెంగాల్‌లో సినిమాపై నిషేధాన్ని తొలగించాలని కోరారు. తమిళనాడు అంతటా సినిమాను ప్రదర్శించే థియేటర్ల వద్ద భద్రత కల్పించాలని మేకర్స్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

The Kerala Story: సుప్రీంకోర్టును ఆశ్రయించిన ‘ది కేరళ స్టోరీ’ దర్శకుడు.. పశ్చిమ బెంగాల్‌లో సినిమాపై నిషేధం తొలిగించాలంటూ..
The Kerala Story

Updated on: May 09, 2023 | 11:33 AM

సుదీప్తో సేన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’కి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సినిమా ప్రదర్శనకు కొన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంటే.. మరికొంత మంది మద్దతు ప్రకటిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో సినిమాపై నిషేధాన్ని తొలగించాలని కోరుతూ ‘ది కేరళ స్టోరీ’ మేకర్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రవ్యాప్తంగా సినిమాను ప్రదర్శించే థియేటర్లకు భద్రత కల్పించాలని మేకర్స్ తమ విజ్ఞప్తి ద్వారా తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు.

‘ది కేరళ స్టోరీ’ నిర్మాతలు పశ్చిమ బెంగాల్‌లో సినిమాపై నిషేధాన్ని తొలగించాలని సుప్రీం కోర్టును కోరారు. పశ్చిమ బెంగాల్‌తోపాటు తమిళనాడు అంతటా సినిమాను ప్రదర్శించే థియేటర్ల వద్ద భద్రత కల్పించాలని మేకర్స్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై కోర్టు స్పందించింది.

మమతా బెనర్జీ ఏం చేశారంటే..

సోమవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వివాదాస్పద చిత్రం ‘ది కేరళ స్టోరీ’ని నిషేదించింది. రాష్ట్రంలో “ద్వేషం, హింసాత్మక సంఘటనలు” నివారించడానికి తక్షణమే నిషేధించాలని ఆదేశించారు. దీనితో, సినిమాను నిషేధించిన మొదటి రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ నిలిచింది. అయితే తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) చీఫ్ సానుభూతి కేరళలోని అమాయక బాలికలపై కాకుండా ఉగ్రవాద సంస్థలపై ఎందుకు ఉందో తనకు అర్థం కావడం లేదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఢిల్లీలోని ఓ సినిమా హాల్‌లో ఠాకూర్ కూడా ఈ సినిమా చూశారు.

యూపీ(Uttar Pradesh) ప్రభుత్వం నుంచి ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. రాష్ట్రంలో విద్వేషం, హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకూడదన్న ఉద్దేశంతో బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ నిర్ణయం తీసుకున్నారని అధికారులు తెలిపారు. ఈ చిత్రాన్ని ఎక్కడైనా ప్రదర్శిస్తున్నట్లు తేలితే కఠిన చర్యలుంటాయని చెప్పారు.

‘ది కేరళ స్టోరీ’ వివాదం ఇది..

వివాహానంతరం ఇస్లాం మతంలోకి మారిన తర్వాత ఐసిస్ క్యాంపులకు అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు మహిళలకు ఎదురైన కష్టాలను ‘ది కేరళ స్టోరీ’ వివరిస్తుంది. ఈ చిత్రంలో అదా శర్మ, యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ ప్రధాన పాత్రలు పోషించారు. కేరళకు చెందిన 32,000 మంది మహిళలు తప్పిపోయి ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌లో చేరారని ట్రైలర్‌లో పేర్కొనడంతో సినిమా చుట్టూ పెద్ద వివాదం చెలరేగింది.

అయితే, నిరసనల నేపథ్యంలో ట్రైలర్‌లోని వివాదాస్పద వ్యక్తి తరువాత ఉపసంహరించుకున్నారు. దీని ట్రైలర్ వివరణ తర్వాత కేరళకు చెందిన ముగ్గురు మహిళల కథగా మార్చబడింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం