Geetha Bhascker: కష్టకాలంలో నా కొడుకుకు అండగా ఉంది తనే.. ఆ హీరోయిన్ తరుణ్ సోల్ మేట్.. తరుణ్ భాస్కర్ తల్లి కామెంట్స్..

తరుణ్‌ భాస్కర్‌, ఈషా రెబ్బాల మధ్య ప్రేమాయణం నడుస్తోందని సామాజిక మాధ్యమాల్లో గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ ఊహాగానాల మధ్య దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ తల్లి గీతా భాస్కర్‌ తాజాగా వారి బంధంపై చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఈఎన్‌ఈ రిపీట్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈషా రెబ్బా తన కొడుకు తరుణ్‌కు సోల్‌మేట్‌ అని స్పష్టం చేశారు.

Geetha Bhascker: కష్టకాలంలో నా కొడుకుకు అండగా ఉంది తనే.. ఆ హీరోయిన్ తరుణ్ సోల్ మేట్.. తరుణ్ భాస్కర్ తల్లి కామెంట్స్..
Geetha Bhascker About Eesha

Updated on: Nov 18, 2026 | 3:32 PM

టాలీవుడ్‌లో తనదైన శైలి సినిమాలతో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్. అయితే కొన్నాళ్లుగా ఈ హీరో గురించి కొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అచ్చ తెలుగమ్మాయి ఈషా రెబ్బా, తరుణ్ మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గత కొంతకాలంగా ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు వీరిద్దరూ తమ రిలేషన్‌షిప్‌పై నేరుగా స్పందించలేదు. కానీ తాజాగా జరిగిన ఈఎన్‌ఈ రిపీట్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ సందర్భంగా తరుణ్ భాస్కర్ తల్లి, ప్రముఖ నటి గీత భాస్కర్ చేసిన కామెంట్స్ వీరి బంధంపై అధికారికంగా క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఎక్కువ మంది చదివినవి : Gulabi Movie: ఒక్క పాటతో స్టార్ డమ్.. గులాబీ సినిమాను మిస్సైన హీరోయిన్.. ఎవరంటే..

గీతా భాస్కర్‌ మాట్లాడుతూ “గత రెండేళ్లుగా తరుణ్‌ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. కోర్టు కేసులు, ఇంటి నిర్మాణం వంటి అనేక సమస్యలు, ఇబ్బందులు వాడిని చుట్టుముట్టాయి. రాత్రిపూట ఆలస్యంగా ఇంటికి వచ్చినప్పుడు కూడా తినడానికి ఒక్క వ్యక్తి అండగా నిలబడింది. ఆ వ్యక్తి ఈషా. ఆమె వాడికి మంచి స్నేహితురాలు, అండగా నిలిచే వ్యక్తి, కుటుంబ సభ్యురాలి వంటిది. నాకు వయసు మీరిపోతోంది. తరుణ్‌కు తోడుగా ఒకరు ఉన్నారనే ధైర్యం నాకు ఉంది. స్నేహితులతో అన్ని విషయాలు పంచుకోలేము, కానీ జీవితంలో ఒక భాగస్వామి, ఒక సోల్‌మేట్‌ ఉండాలి. ఈషా, నువ్వు తరుణ్‌కు అద్భుతమైన మద్దతుగా నిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది, ధన్యవాదాలు” అని భావోద్వేగంతో తెలిపారు. తరుణ్‌ కష్టకాలంలో ఈషా పక్కన నిలబడటం తనకెంతో ధైర్యాన్ని ఇచ్చిందని గీతా భాస్కర్‌ అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవికి భార్యగా, చెల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. 20 ఏళ్లుగా తగ్గని స్టార్ డమ్..

యువతలో కల్ట్ క్రేజ్ సంపాదించుకున్న ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘ఈ నగరానికి ఏమైంది 2’ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా ఎంతో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు చిత్ర యూనిట్‌తో పాటు తరుణ్ తల్లి గీత భాస్కర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపై మాట్లాడిన ఆమె, గత రెండేళ్లుగా తన కొడుకు ఎదుర్కొన్న వ్యక్తిగత, వృత్తిపరమైన ఇబ్బందులను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఒక తల్లి తన కొడుకు ప్రేమను ఇంత ఓపెన్‌గా, అందంగా బహిరంగ వేదికపై అంగీకరించడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: ఏం ట్విస్టులు రా బాబూ.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రెండింగ్‏లో నంబర్ వన్..

ఎక్కువ మంది చదివినవి : ఏముంటది భయ్యా ఈ సాంగ్.. చిరంజీవి, విజయశాంతి కాంబో.. థియేటర్లను ఓ ఊపు ఊపేసింది..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Loading...
Unable to load recommendations.
Follow Us