SS Thaman: థమన్ హింట్ వకీల్ సాబ్ సెకండ్ సింగిల్ కోసమేనా?.. ఆసక్తిగా ఎదురు చూస్తున్న పవన్ అభిమానులు..

|

Feb 07, 2021 | 9:05 AM

Music director SS Thaman: వినసొంపైన బాణీలతో ప్రేక్షకుల మనసులను రంజింపజేస్తున్నాడు టాలీవుడ్ సంగీత దర్శకుడు తమన్. తన టాలెంట్‌తో

SS Thaman: థమన్ హింట్ వకీల్ సాబ్ సెకండ్ సింగిల్ కోసమేనా?.. ఆసక్తిగా ఎదురు చూస్తున్న పవన్ అభిమానులు..
Follow us on

Music director SS Thaman: వినసొంపైన బాణీలతో ప్రేక్షకుల మనసులను రంజింపజేస్తున్నాడు టాలీవుడ్ సంగీత దర్శకుడు తమన్. తన టాలెంట్‌తో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. వరుసగా సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ విజయవంతంగా ముందుకు దూసుకెళుతున్నాడు. తాజాగా టాలీవుడ్ అగ్రహీరో, జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ నటించిన వకీల్‌ సాబ్ మూవీకి సంగీతం అందించాడు. బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ కు రీమేక్ గా దర్శకుడు శ్రీరామ్ వేణు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే పవన్ కం బ్యాక్ సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇప్పటికే థమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరియు ఫస్ట్ సింగిల్ “మగువా మగువ” పాటకు అయితే భారీ రెస్పాన్స్‌ అందుకున్నాయి. మరి అలాగే ఎప్పటి నుంచో ఈ చిత్రం నుంచి సెకండ్ సింగిల్ కోసం పవన్ అభిమానులు ఎంత గానో ఎదురు చూస్తున్నారు. మరి దీనిపైనే అన్నట్టుగా థమన్ ఇచ్చిన హింట్ ఆసక్తి రేపుతోంది. వచ్చే ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే రోజుపై జస్ట్ డేట్ మాత్రమే పోస్ట్ చేసాడు. దీనితో ఇది వకీల్ సాబ్ సెకండ్ సింగిల్ పైనే అన్నట్టుగా అభిమానులు ఫిక్స్ అయ్యిపోయారు. మరి ఆ అప్డేట్ అదేనా లేక వేరే ఏమన్నా అన్నది తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Vakeel Saab Teaser: పవర్‌స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.! ‘వకీల్ సాబ్’ టీజర్ రెడీ.? డేట్ ఎప్పుడంటే.!!