Nithiin: నితిన్ సినిమా కోసం మొన్న రష్మిక, నిన్న శ్రీలీల ఇప్పుడు మరో హీరోయిన్..

|

Nov 21, 2023 | 5:07 PM

గతంలో నితిన్ తో భీష్మ లాంటి సాలిడ్ హిట్ అందించిన వెంకీ కుడుములు దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు వెంకీ కుడుముల. ఛలో, భీష్మ సినిమాలతో సక్సెస్ సాధించాడు వెంకీ. చాలా కాలం తర్వాత ఇప్పుడు మరోసారి నితిన్ తో సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుందని కూడా అనౌన్స్ చేశారు. 

Nithiin: నితిన్ సినిమా కోసం మొన్న రష్మిక, నిన్న శ్రీలీల ఇప్పుడు మరో హీరోయిన్..
Nithin
Follow us on

యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ మధ్యకాలంలో వరుస ఫ్లాప్స్ తో సతమతం అవుతున్నాడు. బ్యాక్ టు  బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ హిట్స్ ఏమాత్రం అందుకోలేకపోతున్నాడు నితిన్. ఈ క్రమంలోనే ఇప్పుడు సాలిడ్ సక్సెస్ కోసం తన పాత దర్శకుడినే నమ్ముకున్నాడు. గతంలో నితిన్ తో భీష్మ లాంటి సాలిడ్ హిట్ అందించిన వెంకీ కుడుములు దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు వెంకీ కుడుముల. ఛలో, భీష్మ సినిమాలతో సక్సెస్ సాధించాడు వెంకీ. చాలా కాలం తర్వాత ఇప్పుడు మరోసారి నితిన్ తో సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుందని కూడా అనౌన్స్ చేశారు.

అలాగే ఈ సినిమాను సంగీతం జీవి ప్రకాష్ అందిస్తున్నాడని కూడా అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా నుంచి రష్మిక మందన్న తప్పుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం రష్మిక వరుస సినిమాలతో వీజీగా ఉండటంతో నితిన్ సినిమా నుంచి తప్పుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రష్మిక ప్లేస్ లోకి శ్రీలీలను కన్ఫామ్ చేశారని టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు ఆమె ప్లేస్ లోకి మరో హీరోయిన్ ను తీసుకున్నారని తెలుస్తోంది.

నితిన్ సినిమానుంచి ఇప్పుడు శ్రీలేల కూడా తప్పుకుందని టాక్ వినిపిస్తుంది. శ్రీలీల వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. దాంతో ఈ సినిమా నుంచి తప్పుకుందని తెలుస్తోంది. ఆమె ప్లేస్ లో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారని తెలుస్తోంది. నభా ప్రస్తుతం సినిమా ఛాన్స్ లు లేక సోషల్ మీడియాతో గడిపేస్తోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత హిట్స్ అందుకోలేకపోయిన నభాకు ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. ఈ సిఎంనిమా సక్సెస్ అయితే నభాకు తిరిగి అవకాశాలు క్యూ కడతాయి. చూడాలి మరి ఎం జరుగుతుందో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.