సినీ, బుల్లి తెరపై వరసగా విషాదాలు నెలకొంటున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది అనేక మంది నటీనటులను పరిశ్రమ కోల్పోయింది. తాజాగా బెంగాలీ సీరియల్ నటి ఐంద్రీలా శర్మ ఓ వైపు ఆస్పత్రిలో ప్రాణాల కోసం పోరాడుతోంది. ఇటీవల ఒకే రోజు అనేకసార్లు గుండెపోటు వచ్చింది. దీంతో కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ నేపథ్యంలో ఐంద్రీలా శర్మ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అయితే ఐంద్రీలా శర్మ బాయ్ ఫ్రెండ్, నటుడు సవ్యసాచి చౌదరి ఐంద్రీలా శర్మ ఆరోగ్యంగా ఆస్పత్రి నుంచి తిరిగి రావాలని అభిమానులు దేవుడిని ప్రార్ధించమంటూ సోషల్ మీడియా వేదికగా అభ్యర్థించారు. అయితే ఇప్పుడు కొంతమంది దారుణంగా ఐంద్రీలా శర్మ మరణించింది అంటూ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు.. ఇలాంటి తప్పుడు వార్తలను ఎలా ప్రసారం చేస్తారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే వారికి సవ్యసాచి సోషల్ మీడియా వేదికగా ఓ సుదీర్ఘ లేఖను రాశారు.
ప్రస్తుతం ఐంద్రీలా చికిత్సకు స్పందిస్తోంది. అంతేకాదు హృదయ స్పందన ఇప్పుడు మునుపటి కంటే మెరుగ్గా ఉంది. రక్తపోటు కూడా సాధారణ స్థితికి చేరుకుంది. ప్రస్తుతం ఐంద్రీలా ఎలాంటి సపోర్ట్ లేకుండానే తనకు ఎదురైన సమస్యను అధిగమించే ప్రయత్నం చేస్తోంది. దయచేసి తప్పుడు వదంతులు ప్రచారం చేయవద్దని సవ్యసాచి చౌదరి విజ్ఞప్తి చేశారు.
అంతకుముందు ఐంద్రీలా పలు మార్లు హార్ట్ స్ట్రోక్‌తో బాధపడింది. చికిత్స నిమిత్తం 1వ తేదీన ఆసుపత్రిలో చేరింది. ఈ సమయంలో ఆమె మెదడులో రక్తస్రావం కావడంతో డాక్టర్ సర్జరీ చేశారు. CT స్కాన్ లో ఐంద్రీలా మెదడులో రక్తం గడ్డకడుతున్నట్లు తెలిసింది. దీంతో రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు వైద్యులు మందులు సూచించినా ఫలితం లేకుండా పోయింది. ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది.
అంతకుముందు ఐంద్రీలా శర్మకు క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ ను జయించిన ఐంద్రీలా ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాల కోసం పోరాడుతోంది. ఈ వార్తల నటీనటులతో పాటు ఆమె అభిమానులను కలిచివేసింది. ‘జుమూర్’ సీరియల్‌తో బుల్లితెరపై అడుగు పెట్టిన ఐంద్రీలా జియోన్ కాథీ, ‘జిబోన్ జ్యోతి వంటి సీరియల్స్ లో తన నటనతో బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..