Thalaivi Update : ‘అమ్మ బయోపిక్’…శోభన్‌బాబు దొరికేశాడు..!

|

Feb 18, 2020 | 10:05 AM

Thalaivi Update :  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘తలైవి’. ఏఎల్‌ విజయ్ ఈ మూవీకి దర్శకుడు.  తమిళ, హిందీ, తెలుగు భాషల్లో మూవీని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ జయలలిత పాత్రలో నటిస్తుండగా, జయ రాజకీయ జీవితంలో కీలక పాత్ర పోషించిన ఎంజిఆర్ రోల్‌లో అరవింద స్వామి కనిపించబోతున్నారు. ఇప్పటికే వీరిద్దరి ఫస్ట్ లుక్స్, ప్రొమోస్ రిలీజై బహుళ ప్రజాదారణ సంపాదించాయి.  ఇక […]

Thalaivi Update : అమ్మ బయోపిక్...శోభన్‌బాబు దొరికేశాడు..!
Follow us on

Thalaivi Update :  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘తలైవి’. ఏఎల్‌ విజయ్ ఈ మూవీకి దర్శకుడు.  తమిళ, హిందీ, తెలుగు భాషల్లో మూవీని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ జయలలిత పాత్రలో నటిస్తుండగా, జయ రాజకీయ జీవితంలో కీలక పాత్ర పోషించిన ఎంజిఆర్ రోల్‌లో అరవింద స్వామి కనిపించబోతున్నారు. ఇప్పటికే వీరిద్దరి ఫస్ట్ లుక్స్, ప్రొమోస్ రిలీజై బహుళ ప్రజాదారణ సంపాదించాయి. 

ఇక మొన్నటితరం హీరో శోభన్‌బాబుకు జయలలిత జీవితంలో ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. వీరిద్దరూ అప్పట్లో రిలేషన్‌లో ఉన్నట్లు కూడా వార్తలు వినిపించాయి. మొదట అసలు శోభన్‌బాబు పాత్ర ‘తలైవి’లో ఉంటుందా..? లేదా..? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. క్యారెక్టర్ ఉంటుందని ఫిక్స్ అవ్వగానే..ఆ రోల్‌లో టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నటించనున్నాడని వార్తలు వినిపించాయి. తాాజాగా సోగ్గాడి పాత్ర కోసం బెంగాలీ నటుడు జిషుసేన్‌ గుప్తాను కన్ఫామ్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అతడు శోభన్‌బాబు పాత సినిమాలు చూసి.. అయన బాడీ లాంగ్వేజ్‌ ఇమిటేట్ చెయ్యడం కోసం ప్రయత్నాలు ప్రారంభించారట. 42 ఏళ్ల జిషుసేన్‌ గుప్తా బాలయ్య హీరోగా నటించిన ‘ఎన్టీఆర్‌ బయోపిక్‌’లో ఎల్వీ ప్రసాద్‌గా కనిపించారు. ఇటీవల నాగ శౌర్య హీరోగా నటించిన ‘అశ్వథ్థామ’లో విలన్‌గా కూడా మెప్పించాడు. కాాగా దీనిపై అఫిషియల్ అనౌన్సిమెంట్ రావాల్సి ఉంది.  ప్రస్తుతం వడివడిగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం జూన్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.