Sonu Sood : సోనూసూద్‌‌‌‌కు సుప్రీంకోర్టులో ఊరట.. న్యాయమే గెలుస్తుందని ట్వీట్ చేసిన రియల్ హీరో..

|

Feb 05, 2021 | 9:31 PM

కరోనా సమయంలో నటుడు సోనూసూద్, వలస కార్మికులకు చేసిన సహాయం ఎప్పటికీ మరిచిపోలేదనిది. ఇంతకాలం సినిమాల్లో విలన్‌గా నటించిన ఆయన ఈ సమయంలో రియల్ హీరో అయ్యారు.

Sonu Sood : సోనూసూద్‌‌‌‌కు సుప్రీంకోర్టులో ఊరట.. న్యాయమే గెలుస్తుందని ట్వీట్ చేసిన రియల్ హీరో..
సోనూసూద్ సేవలకు  దేశం మొత్తం ప్రశంసలు కురిపించింది. 
Follow us on

sonu sood : కరోనా సమయంలో నటుడు సోనూసూద్, వలస కార్మికులకు చేసిన సహాయం ఎప్పటికీ మరిచిపోలేదనిది. ఇంతకాలం సినిమాల్లో విలన్‌గా నటించిన ఆయన ఆ సమయంలో రియల్ హీరో అయ్యారు. అయితే ఆయన తన సేవను అంతటితో ఆపకుండా మరింత విస్తృతం చేస్తూనే ఉన్నారు. కష్టం అన్నప్రతి ఒక్కరికి అండగా నిలుస్తున్నారు. అయితే అక్రమంగా భవనాలు నిర్మించారని బీఎంసీ సోనూకి నోటీసులు పంపిన విషయం తెలిసిందే.

ముంబైలోని జుహు ప్రాంతంలో సోనూసూద్ కు ఓ భవనం ఉంది. గత ఏడాది అక్టోబర్ లో ఆయనకు బీఎంసీ నోటీసులు పంపించింది. నివాస సముదాయాన్ని హోటల్ గా మార్చి చట్ట విరుద్ధ పద్ధతిలో కమర్షియల్ లాభాలను పొందారని హైకోర్టులో బీఎంసీ వాదించింది. తాజాగా ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన నటుడు సోనూ సూద్ కు ఊరట లభించింది. అతడి రెగ్యులేషన్ దరఖాస్తుపై నిర్ణయం తీసుకునే వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం సోనుసూద్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. న్యాయమే గెలుస్తుందని ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

భూల్‌ భులయ్యా 2 సినిమా యూనిట్‌కు షాక్‌లు ఇస్తున్న సీనియర్ నటి టబు.. పెండింగ్‌లో ఉన్న సీన్లకు నో..!