వారెవ్వా..ఫ‌స్ట్ టైమ్.. ప‌వ‌న్ డ్యుయ‌ల్ రోల్..!

పవర్​స్టార్​ పవన్‌ కల్యాణ్ ఇప్పుడు వ‌రుస సినిమాల‌తో దుమ్ము రేపుతోన్న విష‌యం తెలిసిందే. కొన్నాళ్లు పాలిటిక్స్ పై ఫోక‌స్ పెట్టి మూవీస్ కి దూర‌మైన ప‌వ‌న్..మ‌ళ్లీ ముఖానికి మేక‌ప్ వేసుకున్నారు. అయితే ఆయ‌న తాజా మూవీలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. పవన్‌.. ‘వకీల్‌సాబ్‌తో వెండితెరపైకి రీఎంట్రీ ఇస్తున్నాడు. ఆ మూవీ త‌ర్వాత‌ క్రిష్‌ దర్శకత్వంలో చారిత్రక నేప‌థ్యం ఉన్న‌ ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ ప‌వర్ స్టార్ రెండు విభిన్న పాత్రలు […]

వారెవ్వా..ఫ‌స్ట్ టైమ్.. ప‌వ‌న్ డ్యుయ‌ల్ రోల్..!

Updated on: Mar 27, 2020 | 9:51 PM

పవర్​స్టార్​ పవన్‌ కల్యాణ్ ఇప్పుడు వ‌రుస సినిమాల‌తో దుమ్ము రేపుతోన్న విష‌యం తెలిసిందే. కొన్నాళ్లు పాలిటిక్స్ పై ఫోక‌స్ పెట్టి మూవీస్ కి దూర‌మైన ప‌వ‌న్..మ‌ళ్లీ ముఖానికి మేక‌ప్ వేసుకున్నారు. అయితే ఆయ‌న తాజా మూవీలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. పవన్‌.. ‘వకీల్‌సాబ్‌తో వెండితెరపైకి రీఎంట్రీ ఇస్తున్నాడు. ఆ మూవీ త‌ర్వాత‌ క్రిష్‌ దర్శకత్వంలో చారిత్రక నేప‌థ్యం ఉన్న‌ ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ ప‌వర్ స్టార్ రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నాడంటూ ఫిల్మ్ న‌గ‌ర్ లో వార్త‌లు వినిపిస్తున్నాయి.

పవన్ తన ఫిల్మ్ జ‌ర్నీలో ఇప్పటి వరకు ద్విపాత్రాభినయం చేయలేదు. అందుకే ఈ న్యూస్ అభిమానుల్లో మ‌రింత ఆస‌క్తి పెంచింది. దీనిపై మ‌రికొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు క‌నిపిస్తున్నాయి. హీరోయిన్​ వివరాలను ఇప్పటివరకు రివీల్ చెయ్య‌లేదు యూనిట్. కాగా ఎం.ఎం.కీరవాణి ఈ ప్ర‌స్టిజియ‌స్ ప్రాజెక్ట్ కు సంగీతం అందిస్తున్నారు.